తెలంగాణ

telangana

suryapet Student Ragging Case : మెడికల్ కాలేజ్​లో ర్యాగింగ్.. ఆరుగురిపై కేసు నమోదు

By

Published : Jan 3, 2022, 2:06 PM IST

Updated : Jan 3, 2022, 2:19 PM IST

suryapet Student Ragging Case

suryapet Student Ragging Case : సూర్యాపేట వైద్యకళాశాలలో ర్యాగింగ్‌ ఘటనలో ఆరుగురు విద్యార్థులపై కేసు నమోదైంది. మంత్రి హరీశ్‌రావు ఆదేశాలతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. వైద్య కళాశాల వసతిగృహానికి వెళ్లిన డీఎస్పీ మోహన్‌కుమార్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న 30 మంది విద్యార్థులను ప్రశ్నించారు.

suryapet Student Ragging Case : సూర్యాపేట వైద్యకళాశాలలో జూనియర్ విద్యార్థిపై ర్యాగింగ్ కలకలం రేపింది. వసతిగృహంలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని.. సీనియర్లు ర్యాగింగ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. దుస్తులు విప్పించి సెల్‌ఫోన్‌లో వీడియో తీయటంతో పాటు దాడికి పాల్పడ్డారని విద్యార్థి ఆరోపించారు. గుండు గీసేందుకు యత్నించారని.. తప్పించుకుని వెళ్లి తండ్రికి ఫోన్ చేసినట్లు బాధితుడు తెలిపారు. బాధితుడి తండ్రి వెంటనే 100కు ఫిర్యాదు చేయడంతో స్థానిక పోలీసులు హాస్టల్‌కు చేరుకుని ఆందోళనలో ఉన్న బాధితుడిని ఠాణాకు తరలించారు. ర్యాగింగ్ చేసిన విద్యార్థులపై ఫిర్యాదుచేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని.. బాధితుడు, అతడి తండ్రి ఆరోపించారు. విద్యార్థులు ఘర్షణ పడిన మాట వాస్తవమేనని, విచారణకు ఆదేశించామని ఆసుపత్రి సూపరింటెండెంట్ మురళీధర్‌రెడ్డి వెల్లడించారు.

నిజమని తేలితే శిక్ష తప్పదు..

suryapet Student Ragging Case Updates : సూర్యాపేట వైద్య కళాశాలలో జూనియర్​ విద్యార్థిపై ర్యాగింగ్ ఘటనకు సంబంధించి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ర్యాగింగ్ విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించేందుకు ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కమిటీ ఇవాళ నివేదిక ఇస్తుందన్న మంత్రి.. ర్యాగింగ్ జరిగినట్లు నిర్ధారణ అయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

6 సెక్షన్ల కింద ఆరుగురిపై కేసు

suryapet Medical Student Ragging Case : మంత్రి హరీశ్‌రావు ఆదేశాలతో ర్యాగింగ్ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. వసతి గృహంలో విచారణ చేపట్టిన డీఎస్పీ మోహన్ కుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్న 30 మంది విద్యార్థులను ప్రశ్నిస్తున్నారు. ఘటనకు సంబంధించి ఆరుగురిపై కేసు నమోదు చేశామని డీఎస్పీ వెల్లడిచారు. మొత్తం 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు.

సంబంధిత కథనాలు :

Last Updated :Jan 3, 2022, 2:19 PM IST

ABOUT THE AUTHOR

...view details