తెలంగాణ

telangana

Road Accident: మద్యం మత్తులో డ్రైవింగ్.. ప్రమాదంలో ఒకరు మృతి, 16 మందికి గాయాలు

By

Published : Apr 15, 2023, 4:04 PM IST

Road Accident in Huzurnagar: సూర్యపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఒకరు మృతి చెందగా.. 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారందరూ స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

road accident in Huzurnagar
హుజూర్‌నగర్​లో రోడ్డు ప్రమాదం

Road Accident in Huzurnagar: డబ్బు సంపాదించాలని తమ రాష్ట్రం వదులుకోని వేరే రాష్ట్రానికి వచ్చి కష్టపడుతుంటారు. అలాంటి వారికి కష్టం వస్తే ఆదుకొనే వారే ఉండరు. మరి అనుకోకుండా ప్రమాదాలు జరిగినప్పుడు వారి పరిస్థితి దారుణంగా ఉంటుంది. కష్టాన్ని నమ్మకున్న వారికి చివరికి కన్నీళ్తే మిగులుతాయి. వేరే రాష్ట్రం వ్యక్తులు కూలి పనికి వెళ్తున్న క్రమంలో అనుకోని ఘటన జరిగింది. మద్యం తాగినప్పుడు వాహనాలు నడపరాదు అని ఎంత చెప్పిన చెవిట వాడి ముందు శంఖం ఊదినట్లే.

ఈ నినాదాన్ని చాలా మంది పాటించట్లేదు. జాగ్రత్తలు తీసుకొని వాహనాన్ని నడుపుతుంటేనే అనుకోకుండా ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి మద్యం తాగినప్పుడు వాహనాన్ని నడిపితే ప్రమాదం జరిగేందుకే ఎక్కువ శాతం ఆస్కారం ఉంటుంది. ఒక్కోసారి మద్యం తాగి డ్రైవ్​ చేసిన తప్పుకి ఇంకెవరో వారి ప్రాణాలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మరికొన్ని సందర్భాల్లో వారి ప్రాణాలే పొగొట్టుకుంటారు. సూర్యపేట జిల్లాలో మద్యం మత్తులో డ్రైవ్​ చేస్తున్న వ్యక్తి ఆగి ఉన్న వాహనాన్ని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.

ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణంలో లింగ గిరి రోడ్ దగ్గర ఓ ఇంటి ముందు ప్రయాణికులను ఎక్కించుకొనేందుకు ఆగిన టాటా ఏస్ వాహనాన్ని సిమెంట్​ లోడుతో అటువైపుగా వెళ్తున్న లారీ అతి వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో టాటా ఏస్ వాహనం ఇంట్లోకి చొచ్చుకుపోయి వెళ్లింది. దీంతో టాటా ఏస్​ వాహనంలో ఉన్న ఒక వ్యక్తి మృతి చెందాడు. అందులో ఎక్కిన 16 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి.

ఈ కూలీలను బిహార్​కి చెందిన వారిగా స్థానికులు గుర్తించారు. క్షతగాత్రులు స్థానిక రైస్ మిల్లుల్లో వరి ధాన్యాన్ని లోడ్ చేసే కూలీ పని చేస్తున్నట్టు స్థానికులు గుర్తించారు. ఇంటిని ఢీ కొనడంతో గోడ కూలింది. ఇంట్లో గృహపకరణాలు సైతం ధ్వంసం అయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన పక్కనే ఉన్న హుజూర్‌నగర్ ఆసుపత్రికి తరలించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం సూర్యాపేట జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ప్రమాదానికి కారణం లారీ డ్రైవర్​ మద్యం తాగి వేగంగా నడపడమే అని స్థానికులు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details