తెలంగాణ

telangana

భాజపా నేతలపై ఈసీకి తెరాస ఫిర్యాదు

By

Published : Oct 3, 2020, 7:14 AM IST

దుబ్బాకలో ఓటర్లను భాజపా ప్రలోభ పెడుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి తెరాస ఫిర్యాదు చేసింది. భాజపా నేత రఘునందన్ రావు పార్టీ జెండాలు, బ్యానర్ల పేరుతో ఓటర్లకు చీరలు, డ్రెస్​లు పంపిణీ చేస్తున్నారని ఆరోపించింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందున భాజపా నేతలపై చర్యలు తీసుకోవాలని కోరింది.

trs
trs

దుబ్బాకలో ఓటర్లను భాజపా ప్రలోభ పెడుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయెల్​కు తెరాస ఫిర్యాదు చేసింది. సీఈఓ కార్యాలయంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ గుప్తా ఫిర్యాదు సమర్పించారు. భాజపా నేత రఘునందన్ రావు పార్టీ జెండాలు, బ్యానర్ల పేరుతో ఓటర్లకు చీరలు, డ్రెస్​లు పంపిణీ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

దుబ్బాకలోని బాలాజీ ఫంక్షన్ హాల్​తో పాటు పలు ఫంక్షన్ హాళ్లలో చీరలు, డ్రెస్ దాచిపెట్టినట్లు ఆరోపించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందున భాజపా నేతలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల్లో ప్రజలకు చెప్పుకోవడానికి భాజపాకు ఏమీ లేక.. అక్రమాలకు పాల్పడుతోందని శ్రీనివాస్ రెడ్డి, భరత్ గుప్తా ఆరోపించారు.

ఇదీ చదవండి :ఆన్‌లైన్‌లోనూ అంతగా సాగని ప్రక్రియ.. ప్రైవేట్ సాయానికి అనుమతులు

ABOUT THE AUTHOR

...view details