తెలంగాణ

telangana

Teenmar Mallanna News : 'అమ్మతోడు.. ఇప్పట్నుంచి కేసీఆర్​ను తిట్ట'

By

Published : May 6, 2022, 1:33 PM IST

Teenmar Mallanna " 'అమ్మతోడు.. ఒట్టేసి చెబుతున్నా.. ఇక నుంచి కేసీఆర్​ను ఒక్క మాట కూడా తిట్ట' అని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. 7200 మూవ్​మెంట్ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి దోపిడీ రాజ్యం పోయి ప్రజా ప్రభుత్వం ఏర్పడేదాకా పోరాడతానని చెప్పారు.

Teenmar Mallanna News
Teenmar Mallanna News

Teenmar Mallanna About KCR : ‘ఒట్టేసి చెపుతున్న.. ఇక నుంచి కేసీఆర్‌ను ఒక్క మాట కూడా తిట్టను. ‘7200 మూవ్‌మెంట్‌’ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి దోపిడీ రాజ్యం పోయి ప్రజా ప్రభుత్వం ఏర్పడేదాకా పోరాటం చేస్తా’ అని తీన్మార్‌ మల్లన్న స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో గురువారం నిర్వహించిన ‘7200 మూవ్‌మెంట్‌’ సన్నాహక సమావేశానికి ఆయన హాజరయ్యారు.

Teenmar Mallanna Latest News : ముఖ్యమంత్రి, మంత్రులపై విమర్శలు చేయటం తమ విధానం కాదన్నారు. ప్రజా చైతన్యానికే తమ పోరాటమన్నారు. విద్యావంతులైన బాల్క సుమన్‌, గాదరి కిషోర్‌లకు విద్యాశాఖను అప్పగిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. పేదోళ్ల, పెద్దోళ్ల బిడ్డలు ఒకే పాఠశాలలో వరుసలో కూర్చొని చదువుకోవాలన్నదే తమ మూవ్‌మెంట్‌ లక్ష్యమని తెలిపారు.

అకాల వర్షాలొచ్చి రాష్ట్రమంతటా రైతులు ఆగమాగం అవుతుంటే ముఖ్యమంత్రి మాత్రం వ్యవసాయ క్షేత్రం విడిచి బయటకు రావడం లేదని మల్లన్న విమర్శించారు. యాదాద్రిలో రూ.వందల కోట్లు వెచ్చించి చేసిన అభివృద్ధి ఒక్క గాలివానకే తేలిపోయిందని పేర్కొన్నారు. తమ ఆస్తులన్నీ ప్రభుత్వానికి రాసిచ్చి జూన్‌ రెండో వారంలో చేపట్టే ప్రజాపాదయాత్రలో పాల్గొంటామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్‌ రజనీకుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details