తెలంగాణ

telangana

ఒకప్పుడు కేసీఆర్ నిర్వాసితుడు.. అందుకే..! : వెంకట్రామిరెడ్డి

By

Published : Jan 26, 2021, 1:05 PM IST

సిద్దిపేట కలెక్టరేట్​లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ వెంకట్రామిరెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం ముంపు బాధితులను ఉద్దేశించి మాట్లాడారు. నిర్వాసితుల సహకారం వల్లే ప్రాజెక్ట్​ల నిర్మాణం వేగంగా జరుగుతోందని అన్నారు.

republic-day-celebrations-in-siddipet-collectorate-by-collector-venkatarami-reddy
ముంపు ప్రజలను ప్రభుత్వం గుండెల్లో పెట్టుకుంది: కలెక్టర్

ముంపునకు గురైన కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం గుండెల్లో పెట్టుకుంటోందని... నిర్వాసితుల త్యాగఫలమే సాగునీటి ప్రాజెక్ట్​ల నిర్మాణమని సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి అన్నారు. సిద్దిపేట కలెక్టరేట్​లో 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

నిర్వాసితుల సహకారం వల్లే ప్రాజెక్ట్​ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ ఒకప్పుడు నిర్వాసితుడు కావడం వల్లే.. ముంపు ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మెరుగైన ప్యాకేజీ, పునరావాసాలను కల్పిస్తున్నామని చెప్పారు. అందరి సహకారంతోనే జిల్లాను అన్ని రంగాల్లో నంబర్ వన్​గా తీర్చిదిద్దుతున్నామన్నారు.

ఇదీ చదవండి:కనీవినీ ఎరుగని పథకాలతో.. దేశంలో అగ్రగామిగా తెలంగాణ

ABOUT THE AUTHOR

...view details