తెలంగాణ

telangana

Harish Rao Tweet: 'ప్రకృతికి-మనిషికి ఇలాంటి సంబంధమే ఉండాలి'

By

Published : Sep 8, 2021, 12:17 PM IST

mother-and-child-shape

ఈ ఫోటోను చూస్తుంటే.. పచ్చదనం ఎంత పవిత్రమైనదో చెప్పకనే చెప్తున్నట్లు ఉంది కదూ. తల్లి తన బిడ్డలపై చూపించే ప్రేమ ఎంత స్వచ్ఛంగా, ఆహ్లాదంగా ఉంటుందో... ఈ చిత్రాన్ని చూస్తే మనకు కూడా అలానే అనిపిస్తుంది కదా... ఇంతకీ ఈ గడ్డి విగ్రహం ఎక్కడుందో తెలుసా...

సిద్దిపేట అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ కార్యాలయంలో గడ్డితో ఏర్పాటు చేసిన తల్లి, బిడ్డల ఆకృతి విశేషంగా ఆకట్టుకుంటోంది. సుందరీకరణ పనుల్లో భాగంగా పచ్చదనంతో కూడిన తల్లి, బిడ్డ ఆకృతులు అధికారులు ఏర్పాటు చేశారు.

తల్లి-బిడ్డల మధ్య ప్రేమను, అనురాగాన్ని, ఆప్యాయతను తెలియజేసేలా ఈ కళాఖండాన్ని తీర్చిదిద్దారు. తల్లికి బిడ్డకు మధ్య ఎంతటి బంధం ఉంటుందో... అలాంటి బంధమే ప్రకృతికి మనిషికి మధ్య ఉండాలన్న సూచికగా ఈ ఆకృతులు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. తల్లి-బిడ్డల ఆప్యాయతను తెలియజేసేలా ఏర్పాటు చేసిన ఈ ఆకృతుల పట్ల మంత్రి హరీశ్‌రావు ముగ్ధులయ్యారు. ట్విట్టర్‌ వేదికగా ఆ చిత్రాలను షేర్​ చేస్తూ... తన ఆనందాన్ని పంచుకున్నారు.

ఇదీ చూడండి:మంజీరాలో చిక్కుకున్న 11 మంది గొర్రెల కాపరులు.. ఎలా బయటకొచ్చారంటే?

ABOUT THE AUTHOR

...view details