తెలంగాణ

telangana

KTR Praises Harish Rao in Siddipet : 'మా బావను అప్పుడప్పుడు సరదాగా ఏడిపిస్తుంటా'

By

Published : Jun 16, 2023, 12:04 PM IST

KTR Harishrao In Siddipet IT Hub : తెలంగాణలో ఎక్కువ ఫాలోయింగ్​ మంత్రులు ఎవరంటే.. ముందుగా వినిపించే పేర్లు హరీశ్ ​రావు, కేటీఆర్. కార్యక్రమం ఏదైనా ఈ ఇద్దరు తమ ప్రసంగాలతో ప్రజలను ఖుషీ చేస్తారు. పంచ్ డైలాగ్​లతో ఆకట్టుకుంటారు. ఇక ఈ ఇద్దరు అదే ఇద్దరు ఒకే వేదికపై ఉంటే.. అభిమానులు, కార్యకర్తల ఆనందం అంతా ఇంతా కాదు. అది కూడా ఒకరిపై ఒకరు ప్రశంసల జల్లు కురిపించుకుంటే అక్కడ ఉన్నవారికి పండగే. సిద్దిపేట ఐటీ హబ్​ ప్రారంభోత్సవంలో అదే జరిగింది. ఇంతకీ ఈ బావబావమరుదులు ఒకరినొకరు ఎలా పొగిడారో తెలుసుకుందామా..?

Ministers
Ministers

Ministers KTR Harishrao In Siddipet IT Hub : తెలంగాణ మంత్రుల్లో కేటీఆర్​కు.. హరీశ్​రావుకు మంచి ఫాలోయింగ్ ఉంది. రాష్ట్రంలో హరీశ్​రావు ఆర్థిక, ఆరోగ్య శాఖల మంత్రిగా చేస్తున్న అభివృద్ధి అంతా ఇంతా కాదు. ఇక ముఖ్యంగా తన జిల్లా సిద్దిపేటలో హరీశ్ రావు చేసే సేవల గురించి తెలియని వారంటూ ఉండరు. దేశానికి తెలంగాణ మోడల్ అయితే.. తెలంగాణకు సిద్దిపేట మోడల్ అనే విధంగా ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దారు హరీశ్ రావు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హరీశ్ రావు పాలనకు ఫిదా అయ్యారు. అదే విషయాన్ని చాలా సభల్లో కేసీఆర్ బహిరంగంగానే ప్రస్తావించి.. హరీశ్ రావుపై ప్రశంసలు కురిపించారు.

ఇక మంత్రి కేటీఆర్​ విషయానికి వస్తే అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణను ఉన్నత స్థాయిలో నిలబెడుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి వేలాది సంఖ్యలో యువతకు ఉపాధి కల్పిస్తున్నారు. కేటీఆర్​కు సోషల్ మీడియాలోనూ.. బయటా సూపర్ క్రేజ్ ఉంది. మొత్తానికి ఈ బావాబావమరుదులు తెలంగాణలో మంచి ఫాలోయింగ్ కలిగి ఉన్నారు. ఇక ఈ ఇద్దరు అప్పడప్పుడు సోషల్ మీడియా వేదికగా సవాళ్లు.. ప్రతిసవాళ్లు.. సరదా ముచ్చట్లు పెడుతుండటం అందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వ కార్యక్రమాల కోసం ఒకే వేదికపై కూడా కనిపిస్తూ ఉంటారు. తాజాగా సిద్దిపేట ఐటీ టవర్ ప్రారంభోత్సవ వేడుకలోనూ ఈ ఇద్దరు మంత్రులు కలిశారు. ఒకే వేదికపై ఈ బావాబావమరిదిలను చూసిన అభిమానులు, కార్యకర్తలు ఫుల్ ఖుష్ అయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో ఈ ఇద్దరు ఒకరిపై మరొకరు ప్రశంసలు కురిపించుకున్న తీరు చూసి అందరు భలే సంబురపడ్డారు.

Siddipet IT Hub Inauguration : సిద్దిపేట ఐటీ టవర్​ ప్రారంబోత్సవంలో మంత్రులు కేటీఆర్​, హరీశ్​రావు పాల్గొన్నారు. అందులో భాగంగానే పలు అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. ఆ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రులు ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నారు. తెలంగాణ అభివృద్ధి కాముకుడు హరీశ్​ అని కేటీఆర్ అనగా.. అంతర్జాతీయ వేధికలపై తెలంగాణ గౌరవాన్ని చాటుతున్నారంటూ కేటీఆర్​ని మంత్రి హరీశ్​రావు కొనియాడారు. సభలో ఇద్దరు మంత్రులు ఆత్మీయ ఆలింగనం చేసుకోవటం అక్కడున్న వారందరిని ఆకర్షించింది.

మళ్లీ ఏమో కొత్తవి కట్టినవ్​ : ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్​ మాట్లాడుతూ... 'నేను ఎప్పుడు సిరిసిల్లా పోయినా సిద్దిపేట మీద నుంచే పోవాలి. సిద్దిపేట రాగానే మా బావా మంత్రి హరీశ్​రావుకు ఫోన్​ చేస్తా. ఏం బావా ఏం సంగతి! ఇక్కడ మళ్లేదో కొత్తగా కట్టినవ్​... కొత్త రోడ్లేసివన్​'... అని అడుగుతా. అప్పుడు మా బావ అందుకు స్పందిస్తూ... 'ఇగ లాభం లేదు. మళ్లీసారి వచ్చినప్పుడు కళ్లుమూసుకొనిపో' అంటాడు. వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి అంటున్నావ్​ అంటూ సరదాగా జవాబిస్తారు అంటూ చమత్కారంగా మాట్లాడారు. హరీశ్​రావు తన బావ కాబాట్టి అప్పుడప్పుడు సరదాగా అలా ఆటపట్టిస్తానని, ఏడిపిస్తుంటానని కేటీఆర్ చెప్పారు. మాలాంటి వారు అసూయ పడేలా సిద్దిపేటను అభివృద్ధి చేశారన్నారు. ఈసారి ఎన్నికల్లో 1.50 లక్షల ఓట్ల భారీ మెజారీటీతో గెలిపించాలని ఆయక కోరారు.

పారిశ్రామిక, ఐటీ రంగాల్లో తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టారని కేటీఆర్​ను మంత్రి హరీశ్​రావు ప్రశంసించారు. వ్యూహాత్మకంగా ముందుకు నడుస్తూ, అనర్గళంగా మాట్లాడుతూ.. అందరిని ఒప్పిస్తూ, మెప్పిస్తూ రాష్ట్రానికి పరిశ్రమలను, పెట్టుబడులు రప్పిస్తున్నారన్నారు. యువతకు ఉపాధి కల్పిస్తున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో కూడా కేటీఆర్​ లాంటి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కావాలని కోరుకుంటూ సామాజిక మాధ్యామాల్లో పోస్టులు పెడుతున్నట్లు తాను చూశానని అన్నారు .

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details