తెలంగాణ

telangana

మిషన్​ భగీరథ దేశానికే ఆదర్శం: మంత్రి హరిశ్​ రావు

By

Published : May 28, 2020, 6:59 PM IST

మిషన్ భగీరథ ప్రాజెక్టు ద్వారా ప్రతి మనిషికి 100 లీటర్ల స్వచ్ఛమైన త్రాగునీరు ప్రతినిత్యం సమయానికి ఇవ్వాలన్నదే ప్రాజెక్ట్​ లక్ష్యమని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. సిద్దిపేటలో మిషన్ భగీరథ ఆర్​డబ్ల్యూఎస్​ కార్యాలయాన్నిఆయన ప్రారంభించారు.

Minister Harish Rao opened the Mission Bhagiratha RWS office in Siddipeta district
మిషన్​ భగీరథ దేశానికే ఆదర్శం: మంత్రి హరిశ్​ రావు

సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువు సమీపంలో 1.50కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన మిషన్ భగీరథ ఆర్​డబ్ల్యూఎస్​ కార్యాలయాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్‌ భగీరథ పథకం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని వెల్లడించారు. ఎక్కడ త్రాగునీటి లీకేజీలు ఉండొద్దని అధికారులను ఆదేశించారు.

మనిషికి 100 లీటర్లు స్వచ్ఛమైన త్రాగు నీరు ప్రతినిత్యం సమయానికి ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రతి ఆదివారం ఏఈలు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి లాంగ్ షీట్ పంపిన తర్వాత ఉన్నతాధికారులను ఫీల్డ్ పైకి పంపాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు, ఫారూఖ్ హుస్సేన్, ఆర్​డబ్ల్యూఎస్ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details