తెలంగాణ

telangana

'మంగళవారం రైతుబంధు డబ్బులు పడి రైతుల ఫోన్లు టంగుటంగుమని మోగుతాయి'

By ETV Bharat Telangana Team

Published : Nov 26, 2023, 7:49 PM IST

Updated : Nov 26, 2023, 10:48 PM IST

Minister Harish Rao Fires on Congress : కారుకి ఓటు వేస్తే 24 గంటలు.. కాంగ్రెస్​కి ఓటు వేస్తే మూడు గంటలు కరెంట్ అని మంత్రి హరీశ్​రావు ఆరోపించారు. రైతుబంధు రావాలంటే కారు గెలవాలని.. కాంగ్రెస్ ఖతమైతేనే రూ.16 వేల రైతుబంధు వస్తదని స్పష్టం చేశారు. ఈ నెల 30వ తారీఖు నాడు క్యూలో నిలుచున్నప్పుడు కాంగ్రెస్ హయాంలోని కష్టాలను గుర్తు తెచ్చుకొని ఓటు వేయాలని మంత్రి వివరించారు.

Minister Harish Rao Fires on Congress
Minister Harish Rao

'మంగళవారం రైతుబంధు డబ్బులు పడి రైతుల ఫోన్లు టంగుటంగుమని మోగుతాయి'

Minister Harish Rao Fires on Congress :కాంగ్రెస్​కి 11 సార్లు ఓటు వేస్తే మంచినీళ్లు కూడా ఇవ్వలేదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు ఆరోపించారు. కేసీఆర్ గెలవగానే అందరికీ మంచినీళ్లు ఇచ్చి ఆడబిడ్డల కష్టాలు తీర్చారని కొనియాడారు. దుబ్బాకలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీశ్​రావు(Harish Rao) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. 69 లక్షల మంది రైతులు కేసీఆర్​ను కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలని కోరారు. కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు.

Dubbaka BRS Praja Ashirvada Sabha :కారుకి ఓటు వేస్తే 24 గంటలు.. కాంగ్రెస్​కి ఓటు వేస్తే మూడు గంటలు కరెంట్ అని హరీశ్​రావు విమర్శించారు. రైతుబంధు రావాలంటే కారు గెలవాలన్న మంత్రి.. కాంగ్రెస్ ఖతమైతేనే రూ.16 వేల రైతుబంధు వస్తదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వాళ్లవి రైతు వ్యతిరేక విధానాలని.. దయచేసి ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. ఈ నెల 30వ తారీఖు నాడు క్యూలో నిలుచున్నప్పుడు కాంగ్రెస్ హయాంలోని కష్టాలను గుర్తు తెచ్చుకొని ఓటు వేయాలని చెప్పారు. రైతుబంధు అంటే కాంగ్రెస్ గిట్టదన్నారు. యాసంగి పెట్టుబడికి రైతుబంధు ఇస్తుంటే కాంగ్రెస్​ వాళ్లు ఈసీకి ఫిర్యాదు చేశారని ఆరోపించారు. ఎప్పుడైనా న్యాయం ధర్మం గెలుస్తుందని వివరించారు.

BRS Election Campaign in Dubbaka :దేవుడు మంచి పక్షానే నిలబడతాడని.. ఎలక్షన్ కమిషన్​కి వెళ్లి రైతుబంధు పైసలు వేసుకోవచ్చు అని అనుమతి వచ్చిందని మంత్రి చెప్పారు. ఇవాళ, రేపు సెలవు ఉండడంతో మంగళవారం రైతుబంధు పడి రైతులు ఫోన్లు టంగుటంగుమని మోగుతాయని పేర్కొన్నారు. కేసీఆర్ పేద ప్రజల సంపదను పెంచారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీడీ కట్టల మీద బుర్ర గుర్తు పెట్టి మనల్ని ఆగం చేశారని విమర్శించారు. బీజేపీ ఏమో బీడీ కట్టల మీద జీఎస్టీ పేరుమీద 5 శాతం పన్ను వేశారని మండిపడ్డారు. బీడీ కార్మికుల కష్టాలు తెలుసు గనుకనే కేసీఆర్ వారికి పెన్షన్ ఇచ్చారని పేర్కొన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే వారికి రూ.5000 పెన్షన్ పెంచుతారని తెలిపారు.

'బీఆర్ఎస్ ఎప్పటికీ సెక్యులర్‌ పార్టీనే - తల తెగిపడినా దిల్లీ నేతలకు తలవంచం'

Minister Harish Rao on Rythu Runamafi : రైతు రుణమాఫీ 75 శాతం పూర్తయింది 25 శాతం మిగిలిందని మంత్రి హరీశ్​రావు వెల్లడించారు. అది కూడా ఎలక్షన్ కమిషన్​కు లేఖ రాశామని.. అనుమతి వస్తే వేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఒకవేళ రాకపోతే డిసెంబర్ 3 తర్వాత వచ్చేది మన ప్రభుత్వమే వడ్డీతో సహా వేస్తామని భరోసా ఇచ్చారు. 25 శాతం రుణమాఫీకి తాను బాధ్యత తీసుకుంటానని రైతులకు వివరించారు. ధరణి పేరుతో భూములు గుంజుకుంటారని బీజేపీ కొత్త నాటకం ఆడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

దుబ్బాకలో ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన అసైన్డ్ భూములకు పట్టాలిచ్చి ఓనర్లను చేస్తామని హామీ ఇచ్చారు. ఒక్క ఎకరం కాదు కదా.. ఒక్క గుంట కూడా గుంజుకునేది ఉండదని స్పష్టం చేశారు. దుబ్బాక మీద కేసీఆర్​ది కన్నతల్లి ప్రేమ అని కొనియాడారు. బీజేపీ కాంగ్రెస్​ది సవతి తల్లి ప్రేమ అని.. కన్నతల్లి కావాలా సవతి తల్లి కావాలా ప్రజలే తేల్చుకొవాలన్నారు. కార్యకర్తలు కేసీఆర్ పథకాలు ఇంటింటికి వెళ్లి చెప్పాలని కోరారు. ప్రజలే కార్యకర్తలు కావాలని.. అదేవిధంగా కార్యకర్తలే లీడర్లు కావాలని కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకోవాలని సూచించారు. దుబ్బాక అభివృద్ధి జరగాలంటే అది కేసీఆర్​తోనే సాధ్యమని మంత్రి హరీశ్​రావు వివరించారు.

ఎన్నికలంటే ఐదొద్దుల పండుగ కాదు, ఐదేళ్ల భవిష్యత్తు - కాంగ్రెస్​కు ఓటు వేసి రిస్క్​లో పడొద్దు : హరీశ్ రావు

కాంగ్రెస్‌ను నమ్మితే మోసపోతాం - పాపమంటే గోసపడతాం : హరీశ్​రావు

Last Updated :Nov 26, 2023, 10:48 PM IST

ABOUT THE AUTHOR

...view details