తెలంగాణ

telangana

నేడు కోనాయిపల్లికి సీఎం కేసీఆర్ వెంకటేశ్వరస్వామి ఆలయంలో నామినేషన్‌ పత్రాలకు పూజలు

By ETV Bharat Telangana Team

Published : Nov 4, 2023, 9:09 AM IST

KCR Visits Konaipally Venkateswara Swamy Temple : నేడు సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లాలోని కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. నామినేషన్‌ పత్రాలకు పూజలు చేయించనున్నారు. ఎన్నికల బరిలో నిలిచే ప్రతిసారి ఈ ఆలయంలో పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. మరోవైపు కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని అక్కడి గ్రామస్థులు ధీమా వ్యక్తం చేశారు.

KCR
KCR

KCR Visits Konaipally Venkateswara Swamy Temple :తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈమేరకు శుక్రవారం రోజునఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. ఎన్నికల్లో పోటీ చేసే ముందు ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR).. సిద్దిపేట జిల్లా నుంగనూరు మండలం కోనాయిపల్లిలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో నామినేషన్‌ పత్రాలకు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్‌ ప్రారంభమైనందున.. ఈరోజు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌ రావులు.. కోనాయిపల్లిలోని వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ మేరకు స్థానిక ప్రజాప్రతినిధులు ఆలయం వద్ద ఇప్పటికే అన్నిరకాల ఏర్పాట్లు పూర్తి చేశారు.

హ్యాట్రిక్‌ విజయమే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ ప్రచార హోరు

CM KCR Visits Konaipally Today : 1983 ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసిన కేసీఆర్.. స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. కోనాయిపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేస్తే అంతా శుభమే జరుగుతుందని.. అదే గ్రామానికి చెందిన తన స్నేహితుడు చెప్పారు. అప్పటి నుంచి నామినేషన్ పత్రాలకు ఆలయంలో పూజలు చేయడం ఆయన మొదలు పెట్టారు. అనంతరం ఏ ఎన్నికల్లో పోటీ చేసినా తిరుగులేని విజయం సాధించడంతో.. బరిలో నిలిచే ప్రతిసారి నామినేషన్‌ పత్రాలకు పూజలు చేయడం ఆనవాయితీగా మారింది.

KCR Worship Nomination Papers Today :ఈ నేపథ్యంలోనే ఈరోజు కేసీఆర్ ఇక్కడ పూజలు చేయనున్నారు. ఈ సందర్భంగా స్వామివారి దీవెనలతో.. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని కోనాయిపల్లి గ్రామస్థులు ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ నెల 9న మరోసారి కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామిని కేసీఆర్ దర్శించుకోనున్నారు. పూజల అనంతరం.. గజ్వేల్‌, కామారెడ్డిలో ఆయన నామినేషన్‌ వేయనున్నారు. అక్కడి నుంచి కామారెడ్డిలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో కేసీఆర్ ప్రసగించనున్నారు.

'రాష్ట్ర ఆదాయం పెరిగే కొద్దీ సంక్షేమ పథకాలు పెంచుతాం'

First Day Nominations in Telangana 2023 : మరోవైపు తెలంగాణ శాసనసభ ఎన్నికల సమరంలో 119 నియోజకవర్గాలకు తొలిరోజు వంద నామినేషన్లు (Nominations)దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలు కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు మొదటిరోజు పలుచోట్ల నామినేషన్లు వేయగా.. అధికార బీఆర్ఎస్‌ నుంచి ఎవరూ వేయలేదు. తొలిరోజు నామినేషన్లలో అధికంగా స్వతంత్ర అభ్యర్థులవే ఉండగా.. చిన్న పార్టీలకు చెందిన అభ్యర్థులూ అక్కడక్కడ నామినేషన్లు దాఖలు చేశారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొలిరోజు పది మంది అభ్యర్ధులు 11 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎనిమిది నామినేషన్లు దాఖలు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొదటి రోజు 16 నామినేషన్లు దాఖలు చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో తొలిరోజు ఒకే నామినేషన్ దాఖలైంది. ఆదిలాబాద్ జిల్లాలో తొలి రోజు స్వతంత్ర అభ్యర్థి వేసిన ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది.

పోస్టల్ బ్యాలెట్లు దుర్వినియోగం కాకుండా ఈసీ కొత్త రూల్

ఎన్నికల్లో డిపాజిట్‌ కోల్పోవడమంటే ఏంటో తెలుసా? ఎన్ని ఓట్లు వస్తే సేఫ్​?

ABOUT THE AUTHOR

...view details