తెలంగాణ

telangana

ఇంటింటా కొవిడ్ ఫీవర్‌ సర్వే: హరీశ్​ రావు

By

Published : May 8, 2021, 1:54 AM IST

గ్రామస్థాయిలో కరోనా నియంత్రణకు ఇంటింటా కొవిడ్ ఫీవర్‌ సర్వే చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ తెలిపారు. సిద్దిపేట కలెక్టరేట్​లో స్థానిక ఎంపీ, కలెక్టర్​, అధికారులతో కలిసి జిల్లాలోని స్థానిక ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

SIDDIPETA
హరీశ్​ రావు

సిద్దిపేట కలెక్టరేట్​లో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు, పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట్రామి రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.మనోహర్​తో కలిసి జిల్లాలోని స్థానిక ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామస్థాయిలో కరోనా నియంత్రణకు ఇంటింటా కొవిడ్ ఫీవర్‌ సర్వే చేస్తామని చెప్పారు. 666 బృందాల ద్వారా ప్రతి రోజూ సాయంత్రం ఇంటింటా కొవిడ్ ఫీవర్‌ సర్వే నిర్వహిస్తారని తెలిపారు.

సర్వే బృందాల పని తీరును తనతో పాటు జిల్లా యంత్రాంగం మానిటరింగ్ చేస్తుందన్నారు. స్థానిక సర్పంచ్, వార్డు మెంబర్, కార్యదర్శి, ఏఎన్​ఎం, అంగన్​వాడీ, ఆశ, లీఓఏలతో బృందాలు పర్యటిచాలని సూచించారు. సర్వేలో వ్యాధి లక్షణాలుంటే ప్రభుత్వం అందించే మందుల కిట్లను వెంటనే ఇవ్వాలని ఆదేశించారు. వచ్చే 3 వారాలు ధాన్యం కొనుగోలు మినహా మిగతా పనులను అధికారులు బంద్ చేసుకోని సాముహిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలన్నారు. ఆక్సిజన్ లెవెల్ 94 శాతం కంటే తక్కువ ఉంటే 108 ద్వారా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఐసోలేషన్ కేంద్రాలకు తీసుకురావాలని కోరారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

ABOUT THE AUTHOR

...view details