తెలంగాణ

telangana

Harish Rao on Telangana Development : 'చంద్రబాబు హయాంలో ఐటీ ఐటీ.. కేసీఆర్‌ ప్రభుత్వంలో ఐటీతో పాటు అగ్రికల్చర్'

By ETV Bharat Telangana Team

Published : Sep 11, 2023, 4:08 PM IST

Harish Rao on Telangana Development : డాక్టర్ల తయారీలోనూ తెలంగాణ ఇప్పుడు నంబర్‌వన్‌ స్థానంలో ఉందని హరీశ్​రావు తెలిపారు. రాష్ట్రంలో ప్రతిలక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయని వివరించారు. కర్ణాటక, మహారాష్ట్ర, దిల్లీ, పంజాబ్​, గుజరాత్​లో కరెంట్ కోతలు ఉన్నాయని.. కానీ తెలంగాణలో కరెంట్ కోతలు లేవని హరీశ్​రావు వెల్లడించారు.

Harish Rao latest speech
Harish Rao

Harish Rao on Telangana Development :పాలనాదక్షత కలిగిన నాయకుడు ఉంటే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో చెప్పేందుకు.. తెలంగాణనే నిదర్శనమని మంత్రి హరీశ్‌రావు (Harish Rao ) గుర్తుచేశారు. సిద్దిపేటతో పాటు రాష్ట్రంలో అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాయని అన్నారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణది మొదటిస్థానంలో ఉందని పేర్కొన్నారు. ఇంతకు ముందు పంజాబ్, హరియాణా ఉండేదని.. ఇప్పుడు వాటిని దాటవేసి రాష్ట్రం నంబర్​వన్ స్థానంలో ఉందని తెలిపారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన గురుపూజోత్సవం కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Harish Rao Speech in Siddipet District :డాక్టర్ల తయారీలోనూ తెలంగాణ ఇప్పుడు నంబర్‌వన్‌ స్థానంలో ఉన్నట్లుహరీశ్​రావు వివరించారు. రాష్ట్రంలో ప్రతిలక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయని వెల్లడించారు. కర్ణాటక, మహారాష్ట్ర, దిల్లీ, పంజాబ్​, గుజరాత్​లో కరెంట్ కోతలు ఉన్నాయని.. కానీ తెలంగాణలో కరెంట్ కోతలు లేవని వివరించారు. ప్రతిపక్షాలు తిట్లలో పోటీ పడితే.. తాము అభివృద్ధిలో పోటీ పడుతున్నామని చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐటీ ఐటీ అని మాత్రమే అనేవారని.. కానీ ఇప్పుడు కేసీఆర్‌ హయాంలో ఐటీతో పాటు వ్యవసాయంలోనూ వృద్ధి చెందిదని వివరించారు. ఐటీ ఉత్పత్తుల్లో తెలంగాణ నంబర్‌వన్‌గా ఉందని హరీశ్​రావు వ్యాఖ్యానించారు.

Harish Rao Fires on BJP Leaders : 'కేసీఆర్​ పట్టుబట్టి కాళేశ్వరం కడితే.. బీజేపీ తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తుంది'

ఐటీలో 2014కు ముందు 3.50 మంది లక్షల ఉద్యోగాలు చేసేవారని .. కానీ ఇప్పుడు 10 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని హరీశ్​రావు వివరించారు. 3 శాతం జనాభా ఉన్న తెలంగాణకు.. పల్లెలో 38 శాతం ఉత్తమ గ్రామాలుగా అవార్డులు వచ్చాయని పేర్కొన్నారు. 28 శాతం పట్టణాలకు అవార్డులు వచ్చినట్లు తెలిపారు. మిషన్ భగీరథ, ఉత్తమ ఆసుపత్రులు, వైద్యం, ఇలా తదితర రంగాల్లో అవార్డులు వచ్చాయని హరీశ్​రావు వెల్లడించారు.

Harish Rao on Siddipet Development :ఈ క్రమంలోనే దిల్లీలో అవార్డులు ఇస్తారని.. గల్లీలో తిడతారని హరీశ్​రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లాలో హార్టికల్చర్ యూనివర్సిటీ, అటవీ విశ్వవిద్యాలయంను ఏర్పాటు చేసుకున్నామని గుర్తుచేశారు. సిద్దిపేట మెడికల్ హబ్​గా మారుతుందని.. 1000 పడకల ఆసుపత్రిని త్వరలోనే ప్రారంభిస్తామని హరీశ్​రావు పేర్కొన్నారు.

Minister Harish Rao Speech at Council : 'ముఖ్యమంత్రి కేసీఆర్​ పాలనలో.. హైదరాబాద్​​ హెల్త్ ​హబ్​గా మారింది'

"సిద్దిపేటతో పాటు రాష్ట్రంలో అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాయి. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణది మొదటిస్థానం. డాక్టర్ల తయారీలోనూ తెలంగాణ ఇప్పుడు నంబర్‌వన్‌. రాష్ట్రంలో ప్రతిలక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఐటీ ఐటీ అని మాత్రమే అనేవారు. కేసీఆర్‌ హయాంలో ఐటీతో పాటు వ్యవసాయంలోనూ వృద్ధి. ఐటీ ఉత్పత్తుల్లో తెలంగాణ నంబర్‌వన్‌గా ఉంది." - హరీశ్​రావు, మంత్రి

తెలంగాణ ఉద్యమంలో హరీశ్​రావు ఉద్యమ స్ఫూర్తితో పోరాడే వారని.. ఇప్పడు అభివృద్ధిలో కూడా అదే తపనతో చేస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాలలో 1,000 గురుకులాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకు వెళ్తుందని సబితా ఇంద్రారెడ్డి వివరించారు.

Harish Rao on Telangana Development సిద్దిపేటతో పాటు రాష్ట్రంలో అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాయి

Harish Rao on BJP and Congress : 'బీజేపీ, కాంగ్రెస్‌లు రాష్ట్రానికి శాపంగా మారాయి'

Harish Rao Tour in Rangareddy District : 'దీపం లాంటి కేసీఆర్‌ ఉంటుండగా.. కాంగ్రెస్‌, బీజేపీ కావాలా?'

ABOUT THE AUTHOR

...view details