తెలంగాణ

telangana

గజ్వేల్​లో ఘనంగా దసరా వేడుకలు

By

Published : Oct 26, 2020, 12:05 AM IST

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి, దుర్గామాత దర్శనం చేసుకున్నారు. పల్లెల్లో మేళతాళాల నడుమ సంప్రదాయంగా జమ్మిచెట్టు ఆకులను ఇచ్చిపుచ్చుకున్నారు. పలు మండల కేంద్రాల్లోని పోలీస్​స్టేషన్లలో ఆయుధపూజ నిర్వహించారు.

Dasara celebrations in Gajwel siddipet distric
గజ్వేల్​లో ఘనంగా దసరా వేడుకలు

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో ప్రజలు దసరా వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పండుగను పురస్కరించుకుని ఇళ్లలోను, ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి, దుర్గామాత దర్శనం చేసుకున్నారు. దసరా వేడుకలను అన్ని మండలాల్లో ప్రజలు సంప్రదాయబద్ధంగా నిర్వహించుకున్నారు. పల్లెల్లో సామూహికంగా మేళతాళాల నడుమ పాలపిట్ట దర్శనానికి వెళ్లి జమ్మి చెట్టు వద్ద పూజలు చేశారు.

గ్రామాల్లో ప్రజలు జమ్మిచెట్టు ఆకులను ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకుని ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పలు మండల కేంద్రాల్లోని పోలీస్​స్టేషన్లలో ఆయుధపూజలు చేశారు. గజ్వేల్ పట్టణంలోని మహంకాళి దేవాలయ ప్రాంగణంలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దసరా సంబురాలను ఘనంగా నిర్వహించారు. రావణ దహన ఉత్సవానికి పట్టణ వాసులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ ఎంసీ రాజమౌళి, మాజీ ఛైర్మన్ గడిపల్లి భాస్కర్, కమిషనర్ కృష్ణారెడ్డిలతోపాటు పలువురు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:దేశవ్యాప్తంగా దసరా సంబరం, రావణ దహనం

ABOUT THE AUTHOR

...view details