తెలంగాణ

telangana

Car Accident in Siddipet : ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు.. ముగ్గురు విద్యార్థులు మృతి.. ఏడుగురు పరిస్థితి విషమం

By ETV Bharat Telangana Team

Published : Sep 12, 2023, 10:24 PM IST

Car Accident at Chinna koduru in Siddipet : సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదానికి కారణం కారు డ్రైవరేనని స్థానికులు చెబుతున్నారు.

Lorry Accident in Chinna Koduru
Road Accident in Siddipet

Car Accident at Chinna koduru in Siddipet: విద్యార్థులకి ఎన్నో ఆశయాలు ఉంటాయి. బాగా చదువుకొని.. ఉద్యోగం సంపాదించాలని.. తల్లిదండ్రులని బాగా చూసుకోవాలని ఇలా చాలా ఆశలతో చదవు ప్రయాణాన్ని సాగిస్తారు. ఇంజినీరింగ్​ చదివే విద్యార్థులకి మరింతగా ఎక్కువగా ఉంటాయి. అలాంటి లక్ష్యాలను సాధించాలని ఓ కాలేజ్​లో చదువుతూ.. పరీక్షలు రాసేందుకు వేరే కాలేజ్​కి ఉత్సహంగా వెళ్లారు. అనుకున్న విధంగా ఎగ్జామ్​ రాసేశారు. తిరిగి వారి ఇంటికి చేరేందుకు కారు ఎక్కారు. విధి వారి జీవిత ప్రయాణాన్ని ఆపివేయాలని అనుకుందో ఏమో.. వారు ఎక్కిన కారు ప్రయాణమే ఓ ముగ్గురు విద్యార్థులకి చివరిది అయింది. మరికొంత మందికి బాధను మిగిల్చింది. వారు ఎక్కిన కారు డ్రైవర్​ అతి వేగంగా ప్రయాణించి.. ఆగివున్న లారీని ఢీ( Car and Lorry Accident ) కొట్టాడు. దీంతో ముగ్గురు విద్యార్థుల జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి. మరో ఏడుగురు విద్యార్థులకి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండలంలో జరిగింది.

ప్రత్యక్షసాక్షులు తెలిపిన వివరాల ప్రకారం..సిద్దిపేట జిల్లాలోని ఇందూరు ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన బీటెక్ ఫస్ట్ ఇయర్ ఇంజినీరింగ్ విద్యార్థులు, కరీంనగర్ పట్టణంలోని శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కాలేజీల్లో సెకండ్ సెమిస్టర్ పరీక్షలు రాసేందుకు వెళ్లారు. ఎగ్జామ్​ రాసి తిరిగి వస్తున్న క్రమంలో చిన్నకోడూరు మండలం అనంత సాగర్ గ్రామ శివారులో ఆగి ఉన్న లారీని వారు ప్రయాణిస్తున్న వాహనం వేగంగా వచ్చిఢీకొట్టింది.

Warangal Road Accident News : వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, నలుగురికి గాయలు

3 Students Died in Siddipet Road Accident : ఈ ప్రమాదంలో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ విపిన్, గ్రీష్మ, నాగరాజ్​లు అక్కడికక్కడే మృతి చెందారు. దేవిచంద్, నితిన్ రెడ్డి, రోహిత్ రెడ్డి, సాయిచంద్, నర్మద తదితరులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని స్థానికులు గమనించి 108 అంబులెన్స్​ సాయంతో.. సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు డ్రైవర్​ అతివేగంగా రావడమే కారణమని స్థానికులు వాపోతున్నారు. ప్రమాదంలో మృతి చెందినా.. గాయపడిన విద్యార్థులు అందరూ సిద్దిపేట( Siddipet Students Accident ) పట్టణానికి సంబంధించిన వారిగా గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని చేరుకుని.. జరిగిన ప్రమాదాన్ని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ప్రమాదం జరిగిన విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకి తెలియజేశారు. దీంతో వారు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరు తెలుసుకుని బాధపడుతున్నారు.

Road Accident At Nirmal : హైవే మరమ్మతు పనుల్లో ఉన్న కూలీలపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి

పెళ్లికి వెళ్తూ ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి.. మరో ప్రమాదంలో ఐదుగురు..

హైవేపై నుంచి లోయలో పడ్డ బస్సు.. చిన్నారులు సహా 17 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details