తెలంగాణ

telangana

Online Fraud: లిక్విడ్ ఆయిల్​ పేరుతో ఆన్​లైన్​లో రూ.1.72 కోట్లు స్వాహా

By

Published : Apr 27, 2023, 4:35 PM IST

Liquid oil Online Fraud in Gummadidala: సంగారెడ్డి జిల్లా అన్నారం గ్రామానికి చెందిన ఓ రియల్​ ఎస్టేట్​ వ్యాపారిని ఓ ఆన్​లైన్ మోసాలు చేసే ముఠా.. లిక్విడ్ ఆయిల్ పేరుతో రూ.1.72 కోట్లకు మోసం చేసింది. నిండా ముగిసిన మోసం జరిగిందని గుర్తించిన బాధితుడు లబోదిబోమంటూ పోలీసులు ఆశ్రయించడంతో విషయం వెలుగుచూసింది.

Etv Bharat
Etv Bharat

Online Fraud Took place in Gummadidala: రోజురోజుకు ఆన్​లైన్ ​ మోసాలు పెరిగిపోతున్నాయి. టెక్నాలజీలో దేశం ఎంత పురోగతిలో ఎంత పుంజుకున్నా ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఆన్​లైన్​లో ఏర్పడిన పరిచయాలు.. వాటివల్ల కలిగే పర్యవసానాలతో ఉన్నదంతా కోల్పోవాల్సి వస్తోంది. ఆశ పడ్డామా అంతే.. మనకు తెలియకుంటే మన ఆస్తి హారతి కర్పూరమవుతుంది. అవతలి వారి తియ్యటిమాటలకు టెంప్ట్ అయ్యామంటే చాలు ఖాతా ఖాళీ అవుతుంది. అలాంటి ఘటనే సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో చోటుచేసుకుంది. ఆన్​లైన్​లో ఏర్పడిన పరిచయం వల్ల ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఏకంగా రూ.1.72 కోట్లను పొగోట్టున్నాడు. వివరాల్లోకెళ్తే

ఆయిల్​ కంపెనీ కోసం పరిచయం:సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారం గ్రామానికి చెందిన నరహరికి రియల్ ఎస్టేట్​ వ్యాపారం చేస్తుంటాడు. 2019 సెప్టెంబర్​లో మధ్యవర్తి ద్వారా ఓ యువతితో పరిచయం ఏర్పడింది. తన పేరు జానీ విలియమ్స్. తాను యూకేకి చెందిన వ్యక్తిగా పరిచయం చేసుకుంది. తమకు ఫార్మసి కంపెనీ ఉందని మాయ మాటలు చెప్పి నరహరితో పరిచయం పెంచుకుంది. తన ఫార్మా కంపెనీకి జిన్ సాంగ్ లిక్విడ్ ఆయిల్ అవసరం ఉందని నరహరితో చెప్పింది. తమకు ఉత్పత్తి చేసే వారి వివరాలు ఇస్తానని... వాళ్లకి, తమకు మధ్య బయ్యర్​గా ఉండాలని ముగ్గులోకి లాగింది.

నమ్మబలికి నట్టేట ముంచి: జిన్ సాంగ్ లిక్విడ్ ఆయిల్ ఒక్క లీటరు 6 వేల డాలర్లకి కొంటే సగానికి సగం లాభాలు వస్తాయని నమ్మించింది. ఈ వ్యవహారంలో తనకు 3000 డాలర్లు ఇస్తే సరిపోతుందని తెలిపింది. ఈ ఆయిల్​ ఉత్పత్తి చేసే సంజన్ యాదవ్ ఫోన్​ నంబరు, ఇతర వివరాలు ఇచ్చింది. ఇదంతా నిజమేనని నమ్మిన నరహరి తనకు ఈ వ్యాపారంలో లాభం ఉంటుందని ఆశించాడు.

నమ్మి 1.72కోట్లు స్వాహా: ఆ యువతిని నమ్మి ఆమెకు తాను చెప్పినట్టు విడతల వారిగా రూ.1.72 కోట్ల నగదు చెల్లించి ఆయిల్​ కొన్నాడు. తరువాత ఆయిల్​ను జానీ విలియమ్స్​కు విక్రయించబోతే తను ఎంతకీ స్పందించ లేదు. డబ్బులు పోగొట్టుకున్నాక కానీ నరహరికి తాను మోసపోయానన్న విషయం అర్థం కాలేదు. ఇంకేముంది లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. వివరాలు సేకరించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆన్​లైన్​లో పరిచయం చేసుకొని ఇలా ఫ్రాడ్ చేయడం చాలా కాలంగా జరుగుతూనే ఉందని... అయినా ప్రజలు అప్రమత్తం కావడం లేదని సైబర్ నిపుణులు అంటున్నారు. నేరుగా చూడకుండా తెలుసుకోకుండా ఆన్​లైన్​లో పరిచయం అయిన వారితో బిజినెస్​ అంటే ఇలాగే ఉంటుందని.. అందుకే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details