తెలంగాణ

telangana

బీ అలర్ట్​.. ఇవాళ రాష్ట్రంలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు

By

Published : Apr 24, 2022, 12:54 PM IST

Rains in Telangana: ఉపరితల ద్రోణి దృష్ట్యా రాష్ట్రంలో ఇవాళ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది.

rais alert in telangana
తెలంగాణలో వర్ష సూచన

Rains in Telangana: రాష్ట్రంలో ఇవాళ పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది. జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిమీ వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాగల మూడు రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.

ఉపరితల ద్రోణి ఇవాళ ఈశాన్య మధ్యప్రదేశ్​ నుంచి.. విదర్భ, మరాట్వాడ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్రమట్టానికి 900మీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతుందని చెప్పారు వాతావరణ కేంద్రం సంచాలకులు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details