తెలంగాణ

telangana

MMTS Trains Cancelled: ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు.. కారణమదే..!

By

Published : Jan 16, 2022, 5:17 PM IST

MMTS Trains Cancelled: జంట నగరాల్లో తిరిగే ఎంఎంటీఎస్ సర్వీసులను సోమవారం పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ట్రాక్ మరమ్మతులు కొనసాగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

MMTS Trains Cancelled
ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు

MMTS Trains Cancelled: హైదరాబాద్​లో ఈనెల 17వ తేదీ ఎంఎంటీఎస్ సర్వీసులు కొన్నింటిని రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం 79 సర్వీసులు నడుస్తుండగా.. 36 సర్వీసులను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. రైల్వే ట్రాక్ నిర్వహణ పనుల వల్ల ఎంఎంటీఎస్‌ సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పండగ సీజన్ కావడంతో ప్రయాణికుల రద్దీ కూడా భారీగా తగ్గడంతోనే సర్వీసుల రద్దు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సర్వీసులు రద్దయిన మార్గాలివే..

  • లింగంపల్లి- హైదరాబాద్ మీదుగా నడిచే 9 సర్వీసులు రద్దు
  • హైదరాబాద్- లింగంపల్లి మీదుగా నడిచే 9 సర్వీసులు రద్దు
  • ఫలక్‌నుమా- లింగంపల్లి మీదుగా నడిచే 8 సర్వీసులు రద్దు
  • లింగంపల్లి-ఫలక్‌నుమా మీదుగా నడిచే 8 సర్వీసులు రద్దు
  • సికింద్రాబాద్- లింగంపల్లి మీదుగా నడిచే ఒక సర్వీస్ రద్దు
  • లింగంపల్లి- సికింద్రాబాద్ మీదుగా నడిచే ఒక సర్వీస్ రద్దు

ABOUT THE AUTHOR

...view details