తెలంగాణ

telangana

ఎన్నికలు జరిగే పోలింగ్ కేంద్రాల్లో శానిటైజేషన్!

By

Published : Mar 13, 2021, 6:14 PM IST

రేపు జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనా దృష్ట్యా పోలింగ్ కేంద్రాల్లో శానిటైజేషన్ చేశారు. ఓటర్లు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. శానిటైజర్లు అందుబాటులో ఉంచారు.

mlc-election-arrangements-at-serilingampally-and-chandanagar-in-hyderabad-city
ఎమ్మెల్సీ ఎన్నికలకు అంతా సిద్ధం... పోలింగ్ కేంద్రాల్లో శానిటైజేషన్!

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్​నగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని శేరిలింగంపల్లి, చందానగర్ జంట సర్కిల్స్​లో దాదాపు 24 వేల మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం అధికారులు 28 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

పోలింగ్ కేంద్రాలను శానిటైజేషన్‌ చేశారు. భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. ఓటర్ల కోసం శానిటైజర్​... దివ్యాంగుల కోసం వీల్ ఛైర్లను అందుబాటులో ఉంచారు.

ఇదీ చదవండి:ఆ స్కెచ్​పెన్​తో మాత్రమే ఓటు వేయాలి: ఈసీ

ABOUT THE AUTHOR

...view details