తెలంగాణ

telangana

టోల్​ట్యాక్స్​ పెంపు నిరసిస్తూ.. లారీ యజమానుల సంఘం ధర్నా

By

Published : Apr 1, 2023, 10:00 PM IST

Lorry owners association dharna in Vanasthalipuram: కేంద్ర ప్రభుత్వం 5% టోల్​ట్యాక్స్ ధరల పెంపును నిరసిస్తూ తెలంగాణ స్టేట్​ లారీ యజమానుల సంఘం ఆధ్వరంలో ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక మాదిరి డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు

ధర్నా
ధర్నా

Lorry owners association dharna in Vanasthalipuram: ఇటీవల కేంద్ర ప్రభుత్వం టోల్​ట్యాక్స్​ను దేశవ్యాప్తంగా పెంచింది. పెరిగిన టోల్ ట్యాక్స్​ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ స్టేట్ లారీ యాజమానుల అసోసియేషన్ అధ్యక్షులు నందారెడ్డి ఆధ్వర్యంలో వనస్థలిపురం పరిధి ఆటోనగర్​లోని విజయవాడ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. 5% టోల్ ట్యాక్సీలు పెంచడాన్ని తీవ్రంగా ఖండించారు. వెంటనే పెంచిన ధరలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి నశించాలని వారు ఆందోళనకు దిగారు. ఇతర రాష్ట్రాల్లో డీజిల్ ధరలను తగ్గించినట్లుగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే టోల్ ట్యాక్సీ రేట్లు తగ్గేటట్లు చొరవ చూపాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తరచూ డీజిల్, టోల్ ట్యాక్సీ ధరలను పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ లారీ యజమానుల సంఘం నాయకులతో పాటు లారీ యజమానులు పాల్గొన్నారు.

"కరోనా అనంతరం వ్యక్తిగత వాహనాల వినియోగం బాగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వానికి టోల్​ట్యాక్స్​ ద్వారా గణనీయంగా ఆదాయం వస్తున్నప్పటికీ .. 5శాతం పెంచడం అన్యాయం. బీజేపీ అన్నింటిపై ట్యాక్స్​లు పెంచుతూ సామాన్యుల జేబులను గుళ్ల చేస్తూ.. అదానీ, అంబానీలకు లాభం చేకురుస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం డీజీల్​పై ఉన్న స్టేట్​ వ్యాట్​ను తగ్గించి కర్ణాటక రాష్ట్రం మాదిరి డీజీల్​ ధరను తగ్గించాలి".-బూడిద రామ్​రెడ్డి, తెలంగాణ స్టేట్ లారీ యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు

సామాన్యుడిపై బాదుడు..

పెరిగిన టోల్​ట్యాక్స్​ ధరలతో.. ప్రయాణికులపై ఆర్టీసీ భారం మోపింది. గరుడ ప్లస్ నుంచి ఆర్డీనరి బస్సు వరకు ఒక్కో ప్రయాణికుడిపై టోల్ ప్లాజా ఛార్జీలను 4 రూపాయాల వరకు పెంచినట్లు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. నాన్ ఏసీ స్లీపర్ బస్సులో 15 రూపాయాలు, ఏసీ స్లీపర్ బస్సులో 20 రూపాయాలు టోల్ ఛార్జీ వసూలు చేయనున్నారు. కొన్ని సిటీ లోకల్​ బస్సులు టోల్ ప్లాజాల మీదుగా హైదరాబాద్ నుంచి సమీప ప్రాంతాలకు వెళ్లివస్తున్నాయి. వీటిపైనా రూ.4 పెంచినట్లు ఆర్టీసీ తెలిపింది. పెరిగిన ఈ కొత్త టిక్కెట్​ ఛార్జీలు నేటి నుంచే అమ‌ల్లోకి రానున్నాయి.

టోల్​ట్యాక్స్​ పెంపు నిరసిస్తూ లారీ యజమానుల సంఘం వనస్థలిపురం ఆటోనగర్​లో ధర్నా

ఇవి చదవండి:

ABOUT THE AUTHOR

...view details