ETV Bharat / state

సామాన్యుడి ప్ర‌యాణానికి ధ‌రాఘాతం.. ఇలా అయితే.. ఎలా ప్ర‌యాణించేది.. ?

author img

By

Published : Apr 1, 2023, 7:50 PM IST

People Journey becomes hard due to Charges Hike: ఓ వైపు టోల్ ప్లాజా ఛార్జీల పెంపు.. మ‌రోవైపు టోల్ ఛార్జీల కోసం ఆర్టీసీ భారం.. ఇంకో వైపు హైద‌రాబాద్ మెట్రో హాలీడే కార్డు ధ‌ర పెంపు, ర‌ద్దీ వేళ‌ల్లో స్మార్ట్ కార్డుపై డిస్కౌంట్ ఎత్తివేత‌.. ఇలా అన్ని ర‌కాల ధ‌రల పెంపుతో సామాన్యుల ప్ర‌యాణం ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఇలా అయితే ఎలా ప్ర‌యాణం చేసేది అని దిగులు ప‌డుతున్నాడు.

charges
charges

People Journey becomes hard due to Charges Hike: సామాన్యుడు ప్రయాణం చేయాలంటే భ‌య‌ప‌డుత‌ున్నాడు. అన్ని ర‌కాల ధ‌ర‌ల పెంపుతో ఎలా ప్ర‌యాణం చేయాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు. అటు కేంద్ర ప్ర‌భుత్వం, ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలోని ఆర్టీసీ, మెట్రోలు ప‌లు ర‌కాల ఛార్జీలు పెంచి ప్ర‌జ‌ల‌పై భారం వేశాయి. దీంతో సామాన్యుల ప్ర‌యాణ‌మే అగమ్య‌గోచ‌రంగా మారింది.

ప్ర‌జా రవాణా అంటే ఇష్టం లేని వారు సొంత వాహ‌నాల్లో ప్ర‌యాణం చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. అలాంటి ప్ర‌జ‌లు సొంత వాహ‌నాల్లో ప్ర‌యాణించాలంటే భ‌య‌ప‌డుతున్న ప‌రిస్థితి. అటు పెట్రోల్‌, ఇటు డీజిల్ రేట్లు విప‌రీతంగా పెరిగడ‌మే దీనికి కారణం. ముఖ్యంగా గ‌త 8 ఏళ్ల‌లో భారీగా పెరిగాయి. అయినప్ప‌టికీ కొంద‌రు గత్యంతరం లేక ఆ భారాన్ని భ‌రిస్తున్నారు.

ఇక ప్ర‌జా ర‌వాణాపై ఆధారప‌డే ప్ర‌జ‌ల ప‌రిస్థితీ అలాగే ఉంది. రాష్ట్రం ఏర్పడ్డ త‌ర్వాత ఆర్టీసీ సైతం రెండు, మూడు సార్లు ర‌వాణా ఛార్జీలు పెంచింది. దీంతో ప్ర‌యాణికులపై అద‌న‌పు భారం ప‌డింది. తాజాగా టోల్ గేట్ల ఛార్జీల పెంపును సైతం ప్ర‌జ‌ల నుంచే వ‌సూలు చేయాల‌ని నిర్ణ‌యించుకుంది. అనుకున్న‌ట్లుగానే మినీ బ‌స్సుల నుంచి గ‌రుడ ప్ల‌స్ బ‌స్సుల్లో ప్ర‌యాణించే వారి నుంచి ఒక్కొక్క‌రిపై రూ.4 పెంచింది. ఇక నాన్ ఏసీ స్లీప‌ర్ బ‌స్సుల్లో రూ.15, ఏసీ స్లీప‌ర్ బ‌స్సుల్లో రూ.20 టోల్ ఛార్జీలు వ‌సూలు చేయ‌నుంది. ఈ మేర‌కు టోల్ ఛార్జీలు పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌ట‌న కూడా చేసింది.

ఇక సొంత కార్లు క‌లిగి ప్ర‌యాణాలు చేయాల‌నుకునే వారికి కేంద్రం షాక్ ఇచ్చింది. ఆయా జాతీయ ర‌హ‌దారుల‌పై ఉన్న టోల్ ప్లాజా ఛార్జీల‌ను ఈ ఏడాది 5 శాతం పెంచింది. దీంతో మ‌ళ్లీ ప్ర‌జ‌ల‌పైనే భారం ప‌డుతోంది. హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడకు జాతీయ ర‌హ‌దారి-65 మీదుగా వెళ్లి రావ‌డానికి వాహ‌న‌దారులు ప్ర‌స్తుతం రూ.465 టోల్ చెల్లిస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి రూ.490 చెల్లించాల్సి ఉంటుంది.

హైద‌రాబాద్ న‌గ‌ర వాసుల‌కు 2017లో అందుబాటులోకి వ‌చ్చిన మెట్రో సైతం ఇటీవ‌ల ఛార్జీల విష‌యంలో మార్ప‌ులు చేసింది. జ‌న‌రల్ టికెట్ తీసుకునే వారి క‌న్నా.. స్మార్టు కార్డు తీసుకున్న వాళ్ల‌కి 10 శాతం డిస్కౌంట్ ఇచ్చేది. అంతే కాకుండా.. సెల‌వు దినాల్లో ప్ర‌యాణించే వారికి ప్ర‌త్యేకంగా సూప‌ర్ సేవ‌ర్ హాలిడే కార్డు సౌక‌ర్యాన్నీ అందించింది. దీని ద్వారా రూ.59 తో రీఛార్జి చేసుకుంటే ఈ రోజంతా ఎక్క‌డినుంచి ఎక్క‌డికైనా ప్ర‌యాణించ‌వ‌చ్చు. అయితే ప్ర‌స్తుతం ఈ రెండింటో మార్పులు చేసింది. ర‌ద్దీ వేళ‌ల్లో రాయితీ సౌక‌ర్యాన్ని ఎత్తివేయ‌డంతో పాటు హాలిడే కార్డు రీఛార్జినీ రూ.99 కి పెంచింది. దీంతో ప్ర‌జ‌ల‌పై మ‌ళ్లీ ప్ర‌యాణ భారం ప‌డుతుంది.

ఇలా ప్రైవేటు, ప్ర‌జా ర‌వాణాపై ధ‌ర‌ల భారం పెంచ‌డం వ‌ల్ల సామాన్యుల ప్రయాణాల పరిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. సొంత బండ్లు తీసుకుని రోడ్ల మీదకి రావాల‌న్నా... ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థ‌ను ఉప‌యోగించాల‌న్నా.. ర‌వాణా ఛార్జీల దెబ్బ‌కు జంకుతున్నారు.

ఇవీ చదవండి:

ఇప్పుడిక ఆర్టీసీ వంతు.. టోల్ ఛార్జీల భారం ప్ర‌జ‌ల‌పైనే..

నేటి నుంచి వీటి ధరల్లో మార్పు.. అవేంటంటే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.