తెలంగాణ

telangana

Extra Marital Affair Murder Rangareddy : హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం.. ఏడుగురు అరెస్టు

By ETV Bharat Telangana Team

Published : Sep 8, 2023, 11:03 AM IST

Extra Marital Affair Murder Rangareddy: వివాహేతర బంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. పంచాయితీలో పెద్దలు చెప్పినా వినిపించుకోలేదనే అక్కసుతో మహిళ కుటుంబసభ్యులు దారుణానికి ఒడిగట్టారు. సంబంధం కొనసాగిస్తున్న మహిళతోనే యువకుడిని రప్పించి.. కిరాతకంగా హతమార్చి, మృతదేహాన్ని చెరువులో పడేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలంరేపింది. ఈ ఉదంతంలో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

Unknown Person Died in Rangareddy
Praveen Hatya Case in Rangareddy

Praven Murder Case ప్రవీణ్​ని హత్య చేసిన మమత కుటుంబ సభ్యలు

Extra Marital Affair Murder Rangareddy : రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం హైతాబాద్‌ చెరువులో ఈ నెల 4న లభ్యమైన మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. అదే మండలం సంకేపల్లిగూడకు చెందిన యువకుడిని హత్యచేసి, చెరువులో పడేసినట్లు గుర్తించిన పోలీసులు.. వివాహేతర బంధమే ఈ ఘటనకు కారణంగా తేల్చారు. సంకేపల్లిగూడ గ్రామానికి చెందిన కుమ్మరి విటలయ్య కుమారుడు ప్రవీణ్.. కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

అదే గ్రామానికి చెందిన కుమ్మరి సుధాకర్‌ కొన్నేళ్ల క్రితం మృతిచెందగా.. ఆయన భార్య మమతతో ప్రవీణ్‌(Praveen Relation) వివాహేతర బంధం కొనసాగిస్తున్నాడు. ఈ వ్యవహారంతో ఇరు కుటుంబాల మధ్య విభేదాలకు దారితీయగా.. తీరు మార్చుకోవాలని మహిళ కుటుంబసభ్యులు ప్రవీణ్‌ను హెచ్చరించారు. అయినా.. పట్టించుకోకపోవటంతో ఇటీవల గ్రామంలో పంచాయతీ పెట్టించి, మందలించారు. అయినప్పటికీ ప్రవర్తనలో మార్పు రాకపోవటంతో ప్రవీణ్‌ను అంతమొందించటమే మార్గంగా మమత కుటుంబసభ్యులు భావించారు.

Extra Marital Affair Murder in Rangareddy District: ప్రవీణ్‌ను హత్య(Praveen Murder) చేసేందుకు తనతో వ్యవహారం సాగిస్తున్న మమతతో కలిసి ఆమె కుటుంబసభ్యులు కుట్రపన్నారు. ఈ నెల ఒకటో తేదీన రాత్రి 10 గంటల సమయంలో మమత, ప్రవీణ్‌ ఫోన్‌ మాట్లాడుకోగా.. అదే సమయంలో ఇంటికి రావాల్సిందిగా ఆమె కోరింది. ఇంట్లో వారు ఉంటారని యువకుడు అనుమానం వ్యక్తం చేసినా.. అందరూ పడుకున్నారని ఫోటో తీసి, వాట్సాప్‌పంపింది.

నా భర్తని చంపెయ్.. నిన్ను పెళ్లి చేసుకుంటా..

Hyderabad Rowdy Sheeter Muder Case Update : అందమైన అబ్బాయిని ఎర వేసి.. రౌడీ షీటర్​ హత్య..!

Extra Marital Affair Murder Mystery in Rangareddy :ఆమె మాటల్ని నమ్మి ఇంట్లోకి వెళ్లగా.. అప్పటికే అత్తామామలు, తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి కుట్రపన్నిన మమత.. ప్రవీణ్‌ను గదిలో బంధించింది. ప్రవీణ్‌ ఏం జరిగిందని వారిస్తుండగానే మమత రోకలి బండతో యువకుడి తలపై కొట్టింది. రక్తస్రావంతో విలవిలలాడుతున్న యువకుడి నోట్లో గుడ్డలు కుక్కిన కుటుంబసభ్యులు.. అదే రోకలి బండితో కాలిపై కొట్టి.. విరగ్గొట్టారు. అనంతరం, చేతులను వెనక్కి కట్టి, గోనెసంచిలో కుక్కి ఎవరికీ అనుమానం రాకుండా రాత్రికి రాత్రి బయటికి తీసుకెళ్లారు. హైతాబాద్‌ చెరువు వద్దకు తీసుకెళ్లిన మమత కుటుంబసభ్యులుమృతదేహానికి రాళ్లు కట్టి, చెరువులో పడేశారు. అనంతరం తన వస్తువులను అక్కడే కాల్చివేశారు. ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ కెమెరా డేటాను మమత పక్కింటి వ్యక్తి సాయంతో డిలీట్‌ చేయించినట్లు పోలీసులు తెలిపారు.

"సోమవారం ​ చెరువులో ఒక గుర్తు తెలియని మృతదేహాం లభించింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశాం. దర్యాప్తులో చనిపోయిందని ప్రవీణ్​ అని నిర్ధారించుకున్నాం. అతను హత్యకు కారణం వివాహేతర సంబంధం. నిందితులను ప్రస్తుతం అరెస్ట్​ చేశాం. విచారణ మరింత లోతుగా చేస్తున్నాం. "- ప్రశాంత్‌రెడ్డి, చేవెళ్ల ఏసీపీ

ప్రవీణ్‌ను హత్య చేసిన మమతతో పాటు ఆమె మామ కుమ్మరి కిష్టయ్య, అత్త చంద్రకళ, తల్లి లక్ష్మి, సోదరుడు కుమార్‌, తన బావమరిది సహా.. సీసీటీవీ కెమెరాల్లోని డేటా తొలగించిన వెంకటేశ్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. న్యాయస్థానంలో హాజరుపర్చారు. ఈ హత్యోదంతంపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Woman Protest For Her Husband : పిల్లలు పుట్టాక భార్య అందంగా లేదంటూ మరో మహిళతో భర్త.. చివరకు!

Nanakramguda Woman Murder Case Updates : అప్పటికే వారిద్దరికి వివాహేతర బంధం.. చిన్న గొడవతో ఆమెపై హత్యాచారం

ABOUT THE AUTHOR

...view details