తెలంగాణ

telangana

బడంగ్​పేట్​లో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు

By

Published : Oct 1, 2022, 7:32 PM IST

Bathukamma celebrations At Badangpet: రాష్ట్రంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. ఊరూవాడల్లో ఉయ్యాల పాటలు మారుమోగుతున్నాయి. రంగురంగుల పూలను ఒద్దికగా పేర్చి.. రాగ యుక్తమైన పాటలకు లయబద్దమైన తాళం వేస్తూ మహిళలు ఆడిపాడుతున్నారు. రంగారెడ్డి జిల్లా బడంగ్​పేట్ క్రీడా మైదానంలో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా సాగాయి.

Bathukamma celebrations At Badangpet
Bathukamma celebrations At Badangpet

బడంగ్​పేట్​లో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు

Bathukamma celebrations At Badangpet: రాష్ట్రంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చిన మహిళలు సంప్రదాయ నృత్యాలతో ఆడిపాడుతున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరూ వేడుకలను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. పూల సింగిడి నేలకు దిగిందా అన్నట్టుగా చౌరస్తాలన్నీ బతుకమ్మలతో మురిసిపోతున్నాయి.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్​పేట్ క్రీడా మైదానంలో భాజపా నాయకుడు అందెల శ్రీరాములు ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా సాగాయి. కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్​రెడ్డి సతీమణి కావ్య రెడ్డి పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న మహిళలతో కలిసి కావ్య రెడ్డి ఆడిపాడారు. సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ వేడుకల్లో వేలాది మంది మహిళలు పాల్గొన్నారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని కావ్య రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details