తెలంగాణ

telangana

రాజరాజేశ్వర స్వామిని కుటుంబసమేతంగా దర్శించుకున్న బండి సంజయ్

By

Published : Mar 12, 2021, 3:58 AM IST

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దేవాలయం దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఆలయమని అన్నారు. ప్రజల కష్టాలు తొలగి ప్రశాంతమైన వాతావరణంలో జీవించేలా మహాశివుడు ఆశీస్సులు చూపాలని కోరుకున్నారు.

Vemulawada Sri Rajarajeshwara Swamy was visited by the family of BJP state president Bandi Sanjay
శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో బండి సంజయ్

దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఆలయమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. రాజన్నను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం కలగడం పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు.

అతి పవిత్రమైన, శక్తివంతమైన శైవ క్షేత్రం.. శ్రీ రాజరాజేశ్వర దేవాలయం అన్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు దేశం, తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారని తెలిపారు. ప్రజల కష్టాలు తొలగి ప్రశాంతమైన వాతావరణంలో జీవించేలా మహాశివుడు ఆశీస్సులు చూపాలని కోరుకున్నారు.

ఇదీ చూడండి:కనువిందుగా ఐనవోలు మల్లన్న పెద్దపట్నం

TAGGED:

ABOUT THE AUTHOR

...view details