తెలంగాణ

telangana

వేములవాడలో ఘనంగా నరసింహస్వామి జయంతి ఉత్సవాలు

By

Published : May 25, 2021, 4:53 PM IST

రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం నాంపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు.

Telangana news
Sirisilla district

వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయానికి దత్తత దేవస్థానమైన నాంపల్లి గుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి దివ్యకల్యాణ మహోత్సవం జరిపించారు.

ఉత్సవ మూర్తులకు అభిషేకం, నిత్యహోమం, సహస్రనామార్చన, వేదవిన్నపాలు, తీర్థ ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో అర్చక స్వాములు రమణాచారి, విజయ సింహచారితో పాటు పర్యవేక్షకులు అల్లి శంకర్, ఇంఛార్జ్​ నరేందర్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి:రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా అమలవుతోన్న లాక్‌డౌన్​

ABOUT THE AUTHOR

...view details