తెలంగాణ

telangana

వ్యవసాయోత్పత్తులకు అదనపు విలువే లక్ష్యంగా.. రాజన్న సిరిసిల్లలో అవగాహన సదస్సు

By

Published : Sep 29, 2022, 1:10 PM IST

Updated : Sep 29, 2022, 1:47 PM IST

Farmers expo organized

Farmers expo organized in Rajanna Sirisilla: రైతులు, స్వశక్తి సంఘాల వారికి వ్యవసాయోత్పత్తులకు అదనపు విలువ కల్పించే దిశగా అవగాహన కల్పిస్తున్నారు సిరిసిల్ల జిల్లా అధికారులు. పంటలను శుద్ధి చేసి మార్కెట్‌కి తరలిస్తే లభించే అదనపు ఆదాయం గురించి వారికి తెలియజేస్తూ ప్రాసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పేందుకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు, బ్యాంకుల రుణాలు, రాయితీలు లభించే తీరును వివరిస్తున్నారు.

Farmers expo organized in Rajanna Sirisilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎక్స్‌పోకి.. రైతులు, స్వశక్తి సంఘాల నుంచి అపూర్వ స్పందన లభించింది. వరి, మిర్చి, పసుపు, పప్పులు వంటి పంటలు పండించిన తర్వాత వ్యవసాయ క్షేత్రాల వద్దే ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకొనేందుకు ఉన్న అవకాశాలపై అవగాహన కల్పించారు. రైతులు పండించిన పంటలకు అదనపు విలువ కలిసి రావడమేకాకుండా మరికొందరు ఉపాధి పొందే అవకాశం ఉందని తెలిపారు.

ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి సంస్థల క్రమబద్ధీకరణ పథకంలో భాగంగా అందించే సహకారంపై చైతన్యం కల్పించారు. రైతులు పండించిన పంటలను యధావిధిగా విక్రయించకుండా ప్రాసెసింగ్ చేసే సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేసుకొనేందుకు యువతతో పాటు స్వయం సహాయక సంఘాలు, వ్యవసాయ సహకార పరపతి సంఘం వంటి వాటికి అణువుగా ఉంటుందని తెలిపారు. ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేస్తే అధిక లాభాలు గడించే అవకాశం ఉందన్న అంశంపై అవగాహన కల్పించారు.

ప్రతి గ్రామంలో మినీ పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించుకొనేందుకు అవకాశం ఉందని చెప్పడంపై పలువురు ఆశావహులు సంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం పప్పుదినుసులకు చెందిన శుద్ధికేంద్రాలే కాకుండా స్నాక్స్‌ తయారు చేసే యంత్రాల అవసరం అధికంగా ఉందని వివరించారు. శుద్ధికేంద్రాలకు తోడు మరిన్ని ఆహార ఉత్పత్తి కేంద్రాలకు అవకాశం కల్పిస్తే స్వశక్తి గ్రూపులకు అదనపుఆదాయంతోపాటు పలువురికి ఉపాధి లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఇవీ చదవండి:

Last Updated :Sep 29, 2022, 1:47 PM IST

ABOUT THE AUTHOR

...view details