కార్పొరేషన్ల అప్పుల చెల్లింపుల్లో సర్కార్ కొత్త మార్గలు.. కేంద్ర అభ్యంతరమే కారణం!

author img

By

Published : Sep 29, 2022, 8:56 AM IST

కార్పొరేషన్ల అప్పుల చెల్లింపుల్లో సర్కార్ కొత్త మార్గలు.. కేంద్ర అభ్యంతరమే కారణం!

corporations loans in Telangana govt: కేంద్ర నిబంధనలు, ఆంక్షల దృష్ట్యా కార్పొరేషన్ల రుణాల చెల్లింపు విధానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేస్తోంది. నేరుగా బడ్జెట్‌ ద్వారా కాకుండా ఇతర మార్గాలో చెల్లింపులు చేసేలా చర్యలు తీసుకుంటోంది. వివిధ కార్పొరేషన్ల ద్వారా అప్పులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తపడుతోంది.

కార్పొరేషన్ల అప్పుల చెల్లింపుల్లో సర్కార్ కొత్త మార్గలు.. కేంద్ర అభ్యంతరమే కారణం!

corporations loans in Telangana govt: వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాల చెల్లింపు విధానాల్లో రాష్ట్రప్రభుత్వం మార్పులు చేస్తోంది. కార్పొరేషన్ల అప్పులకు సంబంధించిన చెల్లింపులను బడ్జెట్ ద్వారా చేయడంపై కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాలే అందుకు కారణం. కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాల చెల్లింపులను బడ్జెట్ ద్వారా చేస్తే వాటిని ఎఫ్​ఆర్​బీఎం పరిధికి లోబడి రాష్ట్రప్రభుత్వం తీసుకునే అప్పులుగా పరిగణిస్తామని కేంద్రం స్పష్టంచేసింది. ఆ మేరకు గత రెండు ఆర్థికసంవత్సరాల్లో తీసుకున్న రుణాలను ఎఫ్​ఆర్​బీఎం కిందే పరిగణించి ఇక నుంచి బాండ్ల జారీ ద్వారా తీసుకునే అప్పుల్లో ఆ మేరకు కోత విధించింది.

రుణాల చెల్లింపులో మార్పులు: రాష్ట్రప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కోత మొత్తాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి నాలుగేళ్లకు విభజించారు. తద్వారా ప్రస్తుత ఆర్థికసంవత్సరంలో ఎఫ్​ఆర్​బీఎం పరిధికి లోబడి బాండ్లజారీ ద్వారా తీసుకునే రుణాల మొత్తంలో 15వేల కోట్ల మేర తగ్గింది. ఇక వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలు తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది. తద్వారా వాటిపై ఆధారపడి చేపట్టిన కార్యక్రమాలు, పనులు అర్థాంతరంగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆ ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాల చెల్లింపు విధానాల్లో మార్పులు చేస్తోంది.

బడ్జెట్ నుంచి నేరుగా నిధులివ్వకుండా చెల్లింపులు: రుణాలు తీసుకుంటున్న ఆయాకార్పొరేషన్లకు ఆదాయ మార్గాలు ఉండాలని అందులో నుంచే చెల్లింపులు చేయాలని కేంద్రప్రభుత్వం చెబుతోంది. అందుకు అనుగుణంగానే చెల్లింపులు చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. బడ్జెట్ నుంచి నేరుగా నిధులివ్వకుండా చెల్లింపులు జరిగేలా జాగ్రత్తలు తీసుకునే పనిలో నిమగ్నమైంది. కాళేశ్వరంప్రాజెక్టును సాగు,తాగునీటితోపాటు పారిశ్రామికఅవసరాలకు వినియోగిస్తున్నారు. ఆ నీరు వినియోగించుకున్న ఆయా సంస్థలు, శాఖల నుంచి కార్పొరేషన్‌కు ఆదాయం సర్దుబాటు చేసేలా చేస్తున్నారు. ఆ మొత్తం నుంచి అప్పులకు సంబంధించిన చెల్లింపులు జరిపేలా చర్యలు తీసుకోనున్నారు.

మిషన్‌భగీరథ కార్పొరేషన్​ అప్పుల చెల్లింపులు ఎలా?: మిషన్‌భగీరథ కార్పొరేషన్‌ కింద తీసుకున్న అప్పులచెల్లింపులు స్థానికసంస్థల నుంచి వచ్చే ఆదాయం ద్వారా చేసేలాచూస్తున్నారు. ఇందుకు తెలంగాణ డ్రికింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్‌కి పంచాయతీరాజ్‌శాఖ ద్వారా పంచాయతీలకు ఆర్థికసాయం రూపేణా చేస్తున్నారు. ఇందుకోసం 1876 కోట్లను పంచాయతీరాజ్‌శాఖ మంజూరుచేసింది. 2020 మార్చి డిసెంబర్‌ వరకు 2021 ఏడాది మొత్తం, 2022 జూలై వరకు శుద్ధిచేసిన జలాలను వినియోగించుకున్నందుకు ఆ మొత్తాన్ని కార్పొరేషన్ కు చెల్లించేలా పరిపాలనా అనుమతులు మంజూరుచేశారు.

గొర్రెల పంపిణీకి ఎన్​సీడీసీ నుంచి తీసుకునే రుణాల్లో కార్పొరేషన్‌కి ఆదాయాన్ని చూపి అందులోనుంచే చెల్లింపులుచేయాలని భావిస్తున్నారు. మిగతా కార్పొరేషన్ల విషయంలోనూ ఇదే తరహాలో సర్దుబాటు చేయనున్నారు. తద్వారా వివిధ కార్పొరేషన్ల రూపంలో తీసుకునే అప్పులకు కేంద్రం నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు భావిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.