మిషన్‌ భగీరథకు కేంద్ర ప్రభుత్వ అవార్డు.. కేటీఆర్ సెటైర్!

author img

By

Published : Sep 29, 2022, 7:16 AM IST

Updated : Sep 29, 2022, 10:28 AM IST

Mission Bhagiratha

Mission Bhagiratha Scheme Awarded: రాష్ట్రానికి మరో మారు కేంద్ర ప్రభుత్వ అవార్డు లభించింది. మొన్న స్వచ్ఛగ్రామీణ విభాగంలో 13 అవార్డులు గెలుచుకున్న తెలంగాణ రాష్ట్రం తాజాగా ఇంటింటికీ శుద్ధచేసిన తాగునీటిని నల్లాల ద్వారా అందిస్తున్న "మిషన్​ భగీరథ" పథకానికి కేంద్ర ప్రభుత్వ అవార్డు దక్కింది. దేశంలో అత్యధికంగా మారుమూల గ్రామాలకు మంచినీటిని అందిస్తున్న ఏకైన రాష్ట్రంగా తెలంగాణను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.

Mission Bhagiratha Scheme Awarded: రాష్ట్రంలో ఇంటింటికీ శుద్ధిచేసిన తాగునీటిని నల్లాలద్వారా అందిస్తున్న మిషన్ భగీరథ పథకానికి మరోసారి కేంద్ర ప్రభుత్వ అవార్డు దక్కింది. దేశంలో అత్యధికంగా మారుమూల గ్రామాలకు మంచినీటిని అందిస్తున్న ఏకైన రాష్ట్రంగా తెలంగాణను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు జాతీయ జల్ జీవన్ మిషన్ అదనపు కార్యదర్శి రాష్ట్రప్రభుత్వానికి సమాచారం పంపారు. గాంధీజయంతి రోజున దిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆ అవార్డు అందిస్తారు.

మిషన్‌ భగీరథ పథకం
మిషన్‌ భగీరథ పథకం

మిషన్ భగీరథ పథకం అమలు తీరును ఇటీవల పరిశీలించిన కేంద్రం రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 320 గ్రామాల్లో జాతీయ స్థాయి స్వతంత్ర సంస్థ ద్వారా తనిఖీ నిర్వహించింది. మిషన్ భగీరథ నీటి నాణ్యత, సరఫరా తీరును పరిశీలిస్తూనే ప్రజల అభిప్రాయాలు సేకరించింది. ఆ సమాచారాన్ని విశ్లేషించిన జల్‌జీవన్ మిషన్, మిషన్ భగీరథతో ఇంటింటికీ నాణ్యమైన తాగునీరు ఒక్కొక్కరికి 100 లీటర్లు చొప్పున అందుతున్నట్టు గుర్తించింది.

మిషన్‌ భగీరథ పథకం
మిషన్‌ భగీరథ పథకం

అధికారులకు కేసీఆర్​ అభినందనలు: మిషన్ భగీరథ పథకం నాణ్యత, పరిమాణంలో దేశానికే ఆదర్శంగా నిలిచిందనే నిర్ణయానికి వచ్చి అవార్డుకు ఎంపిక చేసింది. రాష్ట్రప్రగతిని గుర్తించి మరోమారు జాతీయ స్థాయిలో అవార్డుకు ఎంపిక చేసినందుకు కేంద్రం, జల్‌జీవన్ మిషన్‌కి రాష్ట్ర ప్రభుత్వం ధన్యవాదాలు తెలిపింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మిషన్ భగీరథ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు.

వ్యగ్యంగా స్పందించిన కేటీఆర్​: అన్ని గ్రామీణ ఆవాసాలకు సురక్షిత తాగునీరు సరఫరా చేస్తున్న విషయాన్ని గుర్తించిన కేంద్రానికి ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్​.. మిషన్ భగీరథకు 19వేల కోట్లు ఇవ్వాలన్న నీతిఆయోగ్ సిఫారసులను ఎన్డీయే ప్రభుత్వం గౌరవిస్తే ఇంకా బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

  • మిషన్ భగీరథకు కేంద్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించింది. ఇంటింటికి నల్లాతో శుద్ధి చేసిన స్వఛ్చమైన తాగునీటిని అందిస్తున్న #మిషన్‌భగీరథ పథకానికి మరోసారి కేంద్రప్రభుత్వ అవార్డు దక్కింది. #MissionBhagiratha pic.twitter.com/lv5ZNk0FKX

    — Telangana CMO (@TelanganaCMO) September 28, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

Last Updated :Sep 29, 2022, 10:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.