తెలంగాణ

telangana

VEMULAWADA: శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

By

Published : Aug 10, 2021, 12:47 PM IST

శ్రావణమాసం సందర్భంగా వేములవాడ శ్రీరాజరాజేశ్వరుని(Sri Raja Rajeshwara temple) సన్నిధిలో భక్తుల సందడి మొదలైంది. వేకువజామునుంచే రాజన్న దర్శనానికి భక్తులు తరలివచ్చారు. బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించి.. మొక్కులు చెల్లించుకుంటున్నారు.

VEMULAWADA Sri Raja Rajeshwara temple, devotees flow at vemulawada
శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు, వేములవాడలో భక్తుల సందడి

రాజన్న సన్నిధికి పోటెత్తిన భక్తులు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ(VEMULAWADA) శ్రీ రాజరాజేశ్వర స్వామి(Sri Raja Rajeshwara temple) ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఉదయం నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు తరలివచ్చారు. ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు.

కానరాని కరోనా నిబంధనలు

శ్రావణం మాసాన్ని పురస్కరించుకొని బద్దిపోచమ్మ ఆలయంలో బోనాలతో భక్తులు వేకువజాము నుంచే పెద్ద సంఖ్యలో బారులు తీరారు. అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇదిలాఉండగా ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. కరోనా వేళ నిబంధలను ఎవరూ పాటించడం లేదు. ఎక్కడా భౌతిక దూరం పాటించలేదు.

ఇదీ చదవండి:Beauty Tips: అందం, ఆరోగ్యం మీ సొంతం కావాలా.. అయితే బాగా తినాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details