తెలంగాణ

telangana

కవయిత్రి రాజేశ్వరికి రవాణాశాఖ అధికారుల అభినందనలు

By

Published : Nov 13, 2020, 3:11 AM IST

రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రానికి చెందిన దివ్యాంగ కవయిత్రి బూర రాజేశ్వరిని ఉమ్మడి కరీంనగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్​పోర్ట్ కమిషనర్ మామిండ్ల చంద్ర శేఖర్​గౌడ్ అభినందించారు.. ఆత్మ విశ్వాసంతో అంగవైకల్యం జయించడమే కాకుండా సంకల్పబలంతో కవితలు రాస్తూ అందరి మన్ననలు అందుకుంటున్న రాజేశ్వరి.. అందరికీ ఆదర్శమన్నారు.

దివ్యాంగ కవయిత్రి రాజేశ్వరికి రవాణాశాఖ అధికారుల అభినందనలు
దివ్యాంగ కవయిత్రి రాజేశ్వరికి రవాణాశాఖ అధికారుల అభినందనలు

దివ్యాంగ కవయిత్రి బూర రాజేశ్వరిని ఉమ్మడి కరీంనగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్​పోర్ట్ కమిషనర్ మామిండ్ల చంద్ర శేఖర్​గౌడ్ అభినందించారు. రాజేశ్వరి విషయాన్ని మహరాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియెట్ పాఠ్య పుస్తకంలో పొందుపర్చడం అభినందనీయమని చంద్ర శేఖర్​గౌడ్ అన్నారు.

తన తండ్రిపేరుపై ఏర్పాటు చేసిన స్మారక సాహిత్య వేదిక ద్వారా రాజేశ్వరికి ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా రవాణా శాఖాధికారి కొండల్ రావ్, ఏఎంవీ ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'పోలింగ్ కేంద్రాల ముసాయిదా విడుదల'

ABOUT THE AUTHOR

...view details