తెలంగాణ

telangana

'15 రోజులుగా నన్ను ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నారు'

By

Published : Mar 1, 2023, 8:49 PM IST

Village Sarpanch Committed Suicide Attempt: ఓ గ్రామ సర్పంచ్ అభివృద్ధి పనులకు సంబంధించి, బిల్లులు రావడం లేదంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తన సొంత నిధులతో పలు అభివృద్ధి పనులు చేసినట్లు సర్పంచ్ తెలిపారు. తనని 15 రోజుల నుంచి కూాడా ఆఫీస్​ల చుట్టూ తిప్పుతున్నారని వాపోయారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంటలో జరిగింది.

Village Sarpanch Committed Suicide Attempt
Village Sarpanch Committed Suicide Attempt

Village Sarpanch Committed Suicide Attempt: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామ సర్పంచ్ రవీందర్​ రెడ్డి అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు రావడం లేదంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. రేగడి మద్దికుంట గ్రామంలో సర్పంచ్ ఇటీవల 8 లక్షల సొంత నిధులతో పలు అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు.

Village Sarpanch Suicide Attempt in Peddapally District: కానీ.. అందుకు సంబంధించిన బిల్లుల చెల్లింపు విషయంలో సుల్తానాబాద్ మండల పరిషత్ అధికారులు లంచం ఆశిస్తున్నట్లు సర్పంచ్ చెప్పారు. అధికారులకు మళ్లీ మళ్లీ లంచం ఇవ్వడం ఇష్టం లేక.. ఈరోజు సుల్తానాబాద్ మండల పరిషత్ కార్యాలయం ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వెల్లడించారు.

ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సర్పంచ్ రవీందర్​రెడ్డి

పైగా ప్రభుత్వం నుంచి పెద్దగా నిధులు రావడం లేదని, గ్రామంలో పనులేమీ చేయలేకపోతున్నానని మనస్తాపానికి చెందారు. ఈ విషయాన్ని గ్రహించిన స్థానిక అధికారులు సర్పంచ్ రవీందర్​రెడ్డిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. కేంద్రం 8 లక్షల 85 రిలీజ్​ చేసిందని.. దానిలో 40 శాతం సీసీ వారికి, 30 శాతం డ్రైనేజీకి కేటాయించిందని సర్పంచ్ తెలిపారు. సొంత డబ్బులతో పనులు చేస్తే, ఆ పనుల డబ్బులు రానివ్వకుండా ఎండీవో అడ్డు పడుతున్నాడని వాపోయారు.

ఎండీవో రూ.5 వేలు డిమాండ్ చేస్తే ఇచ్చానని, ఇప్పుడు ఇంకో 10 వేలు ఇవ్వు గ్రాంట్ రిలీజ్ చేస్తా అంటూ.. బెదిరిస్తున్నాడని తెలిపారు. తమ అకౌంట్ తాళం చెవి అతని దగ్గరే అంటి పెట్టుకున్నాడన్నారు. డ్రైనేజీ, సీసీ, డీజీల్ బిల్లులకే 15 వేలు అడుగుతున్నారని చెప్పారు. 4 నెలలు నుంచి డీజీల్ బిల్లులు వాడట్లేదని, దసరా ముందు నుంచి ఒక్క రూపాయి కూడా వాడలేదని స్పష్టం చేశారు.

15 రోజుల నుంచి ఆఫీస్ చుట్టూ తిప్పుతున్నారని రవీందర్ రెడ్డి వాపోయారు. అదేమిటి అని వెళ్లి అడిగితే ఇంటికి రా, మాట్లాడుకుందామన్నారని తెలిపారు. వీరి వేధింపులు భరించలేక.. పురుగుల మందు తాగాల్సి వచ్చిందని సర్పంచ్ చెప్పారు.

'కేంద్రం 8 లక్షల 85 వేలు రిలీజ్ చేసింది. దానిలో 40 శాతం సీసీకి, 30 శాతం డ్రైనేజీలకు కేటాయించింది. ఎండీవోకి 5 వేలు డిమాండ్ చేస్తే ఇచ్చాను. ఇప్పుడు మళ్లీ 10 వేలు ఇవ్వు అంటున్నాడు. డ్రైనేజీ, సీసీ, డీజిల్ బిల్లులకే 15 వేలు అడుగుతున్నాడు. నాలుగు నెలలు అవుతోంది మేము డిజిల్ బిల్లులు వాడక'. -రవీందర్​రెడ్డి, సర్పంచ్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details