ETV Bharat / state

నేడు హైదరాబాద్‌లో ప్రారంభంకానున్న 'టీ-వర్క్స్‌' కేంద్రం

author img

By

Published : Mar 1, 2023, 3:57 PM IST

Updated : Mar 2, 2023, 7:35 AM IST

KTR on T works programme: గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఔత్సాహిక యువతకు టీ-వర్క్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి కేటీఆర్​ అన్నారు. దేశంలోని అతిపెద్ద నమూనా కేంద్రమైన టీ-వర్క్స్ ప్రారంభం కానుంది. ఉత్పత్తి ఆవిష్కరణలో అగ్రగామిగా నిలిచే దిశగా సాగుతున్న భారతదేశ ప్రయాణాన్ని టీ-వర్క్స్ వేగవంతం చేస్తుందని కేటీఆర్​ విశ్వాసం వ్యక్తం చేశారు.

KTR on T works programme
KTR on T works programme

KTR on T works programme: వినూత్న ఆవిష్కరణలకు వేదికగా మారుస్తూ.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన టీ-వర్క్స్‌ ప్రారంభానికి సిద్ధమైంది. 78 వేల చదరపు అడుగులలో నిర్మించిన టీ-వర్స్క్ భవనం గురువారం ఫాక్స్‌కాన్ సంస్థ చైర్మన్ యాంగ్ యూ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. సంకలిత ప్రోటోటైపింగ్, ఎలక్ట్రానిక్స్ వర్క్‌స్టేషన్, ఫినిషింగ్ షాప్, లేజర్ కటింగ్, పీసీబీ ఫాబ్రికేషన్, కుండల తయారీ, ప్రీ-కంప్లైయన్స్, మెటల్‌షాప్‌ వంటి అత్యాధునిక సాంకేతికతలు అందుబాటులో ఉంచారు.

రాష్ట్ర ప్రభుత్వం టీ-వర్క్స్‌లో సుమారు 100 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు కేటీఆర్ తెలిపారు. సాఫ్ట్‌వేర్ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే టీ-హబ్ ఉండగా హార్డ్‌వేర్‌కు సంబంధించి టీ-వర్స్క్ పనిచేస్తుందని సీఈఓ సుజయ్ కారంపురి అన్నారు. టీ-వర్క్స్‌ గురువారం ప్రారంభంమవుతున్నప్పటికీ గత ఏడాదే సాప్ట్‌లాంచ్ అయ్యింది. ఇప్పటికే ఇందులోని ఆవిష్కరణలు అందరినీ ఆకట్టుకున్నాయి. రైతులు నడుంపై ఎక్కువ ఒత్తిడి పడకుండా పొలంలో పని చేసేందుకు ఉపయోగపడే పరికరాన్ని రూపొందించిన గొర్రె అశోక్ కేటీఆర్ ప్రశంసలు అందుకున్నారు.

"కేంద్రం సహకరించకున్నా యువతలోని నైపుణ్యాలు వెలికితీసేలా చర్యలు తీసుకుంటున్నాం. సత్తా ఉన్నవారిని ప్రోత్సహించేందుకు రాష్ట్రప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుంది. టీ- వీహబ్‌, వీ- హబ్‌ వంటి వాటిని ఏర్పాటు చేశాం. గురువారం సాయంత్రం టీ వర్క్స్‌ని ప్రారంభిస్తాం. అంతే కాకుండా ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ లీవ్ టి వర్క్స్‌ని కూడా ప్రారంభిస్తాం. టీ హబ్‌ తరహాలోనే టీ వర్క్స్‌ తప్పక విజయవంతం అవుతుంది. గ్రామీణ ప్రాంత ఔత్సాహిక యువతకు టి వర్క్స్‌తో ఉపయోగం ఉంది. హైదరాబాద్​లో వందల సంఖ్యలో స్టార్టప్​ కేంద్రాలు నెలకొల్పాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్​ క్యాంప్​ ఈ ప్రాంతంలో ఉంటుంది. "- కేటీఆర్‌, తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి

అంతేకాకుండా వరంగల్‌కు చెందిన రాజేంద్రప్రసాద్ గో-కార్టింగ్ వాహనాన్ని ప్రదర్శనకు ఉంచారు. ప్రముఖ సంస్థల ఉత్పత్తుల మాస్ ప్రొడక్షన్‌కు కావలసిన పరికరాలను కూడా టీ-వర్క్స్ అందిస్తుందని సుజయ్ కారంపురి తెలిపారు. 15 వేల కోట్ల రూపాయల ఖరీదైన సాంకేతిక సామగ్రితో ఇది ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు.

"18 ఎకరాలలో నిర్మించిన ఈ క్యాంపస్ అత్యాధునిక సదుపాయాలతో అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్​గా నిలుస్తోంది. 78 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీ- వర్క్స్ ఫేజ్ వన్ క్యాంపస్ గురువారం ప్రారంభం కానుంది. 2 లక్షల 50 వేల చదరపు అడుగుల్లో ఫేజ్ 2 భవనాన్ని నిర్మిస్తున్నాం. కేవలం అంకురాలకు మాత్రమే కాకుండా చిన్న ఇన్నోవేటర్స్ నుంచి పెద్ద పెద్ద కంపెనీల వరకు చిన్న పిల్లల నుంచి హాబీగా ఎదైనా తయారు చేద్దామనుకునే వారు టీ- వర్క్స్​కు వచ్చి తమ ఉత్పత్తికి రూపకల్పన చేసుకోవచ్చు".- సుజెయ్​ కారంపురి, టీ- వర్క్స్​ సీఈఓ

టీ- వర్క్స్​ సీఈఓ సుజెయ్​ కారంపురితో స్పెషల్​ ఇంటర్య్వూ

ఇవీ చదవండి:

'రాష్ట్రంలో హనుమాన్​ గుడి లేని ఊరు లేదు.. కేసీఆర్ పథకం లేని ఇల్లు లేదు'

'అనవసర అంశాల జోలికొద్దు.. కేసీఆర్​ అవినీతినే ప్రజల్లోకి తీసుకెళ్లండి'

విద్యార్థులకు డిజిటల్ ట్యాబ్​లను అందజేసి.. సందడి చేసిన కేటీఆర్

Last Updated :Mar 2, 2023, 7:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.