తెలంగాణ

telangana

Land Kabza: పురావస్తు శాఖ భూములను కబ్జా చేసేందుకు రియల్టర్ల యత్నం

By

Published : Oct 11, 2021, 4:30 PM IST

భూ అక్రమార్కుల (Land Kabza) ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో వందల ఎకరాల భూములను స్వాహా చేసిన కబ్జాకోరులు... తాజాగా వారి కన్ను పురావస్తు శాఖ భూములపై పడింది.

Land
కబ్జా

పెద్దపల్లి జిల్లా కేంద్రం చుట్టూ ఇప్పటికే వేలాది ఎకరాలను ఇప్పటికే అక్రమార్కులు కబ్జా (Land Kabza) చేశారు. తాజాగా ఏకంగా పురావస్తు (వారసత్వ) శాఖకు చెందిన 66. 28 ఎకరాల భూములపై కన్నేశారు. స్థిరాస్తి వ్యాపారం పేరుతో రియల్ దందాల ఆగడాలు పెరిగిపోయాయి. తమ కార్యకలాపాలకు అడ్డొస్తే భౌతిక దాడులకు సైతం వీరు వెనకాడటం లేదని స్థానికులు వాపోతున్నారు.

పురావస్తు శాఖ భూములకు 100 మీటర్ల వరకు ఇలాంటి క్రయవిక్రయాలు నిర్మాణాలు చేపట్టవద్దని నిబంధనలు ఉన్నాయి. వీటిని బేఖాతరు చేస్తూ దళారులు తాయిలాలతో అధికారులను ప్రసన్నం (Land Kabza) చేసుకున్నారు. వ్యవసాయ భూములను కొనుగోలు చేసి సర్వే నెంబర్లలో మిగులు భూమి రికార్డుల్లో చూపిస్తున్నారు. గుంట భూమికి బదులు 10 గుంటలుగా చిత్రీకరించి జాయింట్ సర్వే ఆజమాయిషీ లేకుండానే జేసీబీ, ట్రాక్టర్లతో చదును చేసి ప్లాట్లుగా మార్చి విక్రయించేందుకు సిద్ధమయ్యారు.

కాపాడండి...

శాతవాహనుల కాలంలో పెద్దపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని పెద్దబొంకూర్ కేంద్రంగా పరిపాలన అందించారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఈ మేరకు ఆ ప్రాంతంలో వారికి సంబంధించిన ఆనవాళ్లు ఆభరణాలు దొరకడం వల్ల పురావస్తు శాఖ చారిత్రక అవశేషాలు ఉన్న ప్రాంతంగా పెద్దబొంకూరును గుర్తించింది. ఈ ప్రాంతంలో 66.7 ఎకరాల మేరకు భూమిని పట్టా రైతుల నుంచి కొనుగోలు చేసి వారికి పరిహారం కూడా చెల్లించింది. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి భూములను అక్రమార్కులు అన్యాక్రాంతం చేయకుండా కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

భూములు కాపాడాల్సిన అధికారులే... భూ కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్నారు. ఫలితంగా పురావస్తు శాఖ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయని చెప్పి గతంలో రైతుల నుంచి భూములు తీసుకున్నారు. ఇప్పుడు అవే భూములు ఓ రాజకీయ నాయకుడు చెప్పాడని మళ్లీ లాక్కొవడానికి ప్రయత్నిస్తున్నారు. అధికారులు ఇలా చేయడం సమజసం కాదు.

--- స్థానికులు, పెద్దపల్లి

పురావస్తు శాఖ భూములను కబ్జా చేసేందుకు రియల్టర్ల యత్నం

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details