తెలంగాణ

telangana

'చమురు ధరలను వెంటనే తగ్గించాలి'

By

Published : Jun 29, 2020, 4:12 PM IST

చమురు ధరల పెరుగుదలను నిరసిస్తూ కాంగ్రెస్​ నేతలు పెద్దపల్లిలో ఆందోళనకు దిగారు. వెంటనే ధరలను తగ్గించాలని డిమాండ్​ చేశారు. జిల్లా అదనపు కలెక్టర్​కు వినతి పత్రం అందజేసి సమస్యలను వివరించారు.

mla sridhar babu demand reduced oil prices immediately
'చమురు ధరలను వెంటనే తగ్గించాలి'

వరుస చమురు ధరల పెంపును నిరసిస్తూ పెద్దపెల్లిలో కాంగ్రెస్ నేతలు ఆందోళన నిర్వహించారు. ఈమేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమురయ్య, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో కలెక్టరేట్​ వద్ద నిరసన తెలిపారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదనపు కలెక్టర్​కు వినతి పత్రం అందజేసి సమస్యలను వివరించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు ఎమ్మెల్యే అధికారులకు తెలిపారు.

ఇదీ చూడండి :'తప్పు చేస్తే సొంత పార్టీ వారైనా చర్యలు తప్పవు'

ABOUT THE AUTHOR

...view details