తెలంగాణ

telangana

'నిర్లక్ష్యం వల్లే ఉస్మానియా ఆస్పత్రికి ఈ దుస్థితి'

By

Published : Jul 16, 2020, 8:30 PM IST

ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణాన్ని తామెప్పుడూ అడ్డుకోలేదని ఎమ్మెల్యే శ్రీధర్​బాబు తెలిపారు. హెరిటేజ్ భవనం ఉన్నచోట కాకుండా పక్కనే కట్టాలని సూచించామని చెప్పారు. ఉస్మానియా ఆస్పత్రిలోకి వరద నీరు రావడానికి కేసీఆర్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు.

కేసీఆర్ నిర్లక్ష్యంతోనే ఉస్మానియా ఆస్పత్రిలోకి వరదనీరు: శ్రీధర్​బాబు
కేసీఆర్ నిర్లక్ష్యంతోనే ఉస్మానియా ఆస్పత్రిలోకి వరదనీరు: శ్రీధర్​బాబు

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ఆరేళ్లు దాటుతోందని, అయినా ఉస్మానియా ఆస్పత్రి గురించి ఏనాడూ పట్టించుకోలేదని కాంగ్రెస్ శాసనసభ్యుడు దుద్దిళ్ల శ్రీధర్​బాబు ఆరోపించారు. కరోనా సమయంలో సచివాలయం కూల్చివేత, నూతన పైవంతెనల శంకుస్థాపన లాంటి కార్యక్రమాలను మాత్రమే తాము తప్పు పట్టామన్నారు.

ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కలిశామని, కరోనాను ఆరోగ్యశ్రీలోకి చేర్చాలని కోరామని శ్రీధర్​బాబు చెప్పారు. కరోనా నివారణలో ముందున్న ఫ్రంట్​లైన్ వారియర్స్‌లో ధైర్యాన్ని నింపడంలో, ప్రజలకు భరోసా కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. తగినంత మంది ఉద్యోగులు లేకపోవడం వల్ల.. 300 మంది పనిచేసే చోట 30 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే సిబ్బంది కొరత తీర్చాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:-రాజధానిలో రోజువారీ కేసుల కన్నా రికవరీలే ఎక్కువ!

ABOUT THE AUTHOR

...view details