తెలంగాణ

telangana

Hath Se Hath Jodo Yatra: కాంగ్రెస్​ నాయకుల మధ్య గొడవ.. పలువురికి గాయాలు

By

Published : Apr 18, 2023, 7:47 PM IST

Updated : Apr 18, 2023, 8:36 PM IST

Hath Se Hath Jodo Yatra in Peddapalli: కాంగ్రెస్​ పార్టీలో విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. పెద్దపల్లి జిల్లాలో హాథ్ సే హాథ్ జోడో యాత్రలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు స్వాగతం పలికే విషయంలో నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ కొట్లాటలో పలువురికి గాయాలయ్యాయి.

కాంగ్రెస్​ నాయకుల మధ్య గొడవ
కాంగ్రెస్​ నాయకుల మధ్య గొడవ

కాంగ్రెస్​ నాయకుల మధ్య గొడవ

Hath Se Hath Jodo Yatra in Peddapalli: కాంగ్రెస్ నాయకుల మధ్య ఉన్న విభేదాలు గతంలో చాలా విధాలుగా బయటకి వచ్చాయి. నాయకుల మధ్యే ఒకరంటే ఒకరికి మనస్పర్థాలు, భిన్న అభిప్రాయాలు ఉన్నాయని చాలా సందర్భాల్లో స్పష్టంగా తెలుస్తోంది.​ తాజాగా మరోసారి పెద్దపల్లి జిల్లాలో నాయకుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పెద్దపల్లి జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. జగిత్యాల జిల్లా నుంచి పెద్దపల్లి జిల్లాలోకి అడుగుపెడుతున్న సందర్భంలో స్వాగతం పలికే విషయంలో కాంగ్రెస్ నాయకులు విజయరమణారావు.. ఓదెల జడ్పీటీసీ సభ్యుడు ఘంటా రాములు వర్గీయులు పోటీపడి ఘర్షణకు దిగారు. దీంతో ఉద్రిక్తత చేసుకుంది.

మొదటిసారి గొడవ ఆపిన.. తగ్గలే:ఇరు వర్గాల వారు పిడుగుద్దులు గుద్దుకున్నారు. డీసీసీ అధ్యక్షుడు మక్కన్‌సింగ్‌ ఇరువర్గాలను నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కాస్త సమయం ఈ గొడవ కుదురుకుందని అందరూ అనుకొన్నారు. కాని కాసేపటికే రెండోసారి పెద్దపల్లి శివారులోని బొంపల్లి వద్ద మరోసారి ఘర్షణకు పాల్పడ్డారు. ఈసారి గొడవ మరింత తీవ్రస్థాయికి చేరుకుంది.

కార్యకర్త తలపై కర్ర దెబ్బ: విజయరమణారావు బీసీ వర్గీయులను అణగదొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరువు వర్గాల మధ్య బాహాబాహీకి దిగారు. ఇరువైపులా నచ్చచెప్పేందుకు యత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. వారి మధ్య తీవ్ర అసంతృప్తి కారణంగా.. కార్యకర్తల్లో ఒకరు కర్ర తీసుకొని కార్యకర్త తలపై కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి.

రోడ్డు పైనే రాస్తారోకో.. డౌన్​డౌన్​ అంటూ నినాదాలు: దీంతో ఆగ్రహించిన కార్యకర్తలు పాదయాత్రలోనే రాస్తారోకో చేపట్టారు. దీంతో వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఒకవైపు రాస్తారోకో కొనసాగుతుండగానే మరోవైపు భట్టి విక్రమార్క తన పాదయాత్రను కొనసాగించారు. విజయరమణారావు డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేసిన కార్యకర్తలు.. బీసీలను అణగదొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాదయాత్రకి వచ్చిన వేలాది అభిమానులు: భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తూ పెద్దపల్లికి చేరుకున్నారు. దీంతో ఏఐసీసీ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆయనకి ఘనంహా స్వాగతం పలికి.. సంఘీభావం తెలిపారు. పట్టణంలోని రాజీవ్​ చౌక్ దగ్గర జరిగే సభలో తనతో పాటు పాల్గొనున్నారు. ఈ సమావేశానికి అధిక మొత్తంలో కాంగ్రెస్​ కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. దీంతో ఆ ప్రాంతం అంతా జనంతో కిక్కిరిసి పోయింది.

ఇవీ చదవండి:

Last Updated : Apr 18, 2023, 8:36 PM IST

ABOUT THE AUTHOR

...view details