తెలంగాణ

telangana

చిరుజల్లులతో చల్లబడ్డ ఇందూరు

By

Published : Jun 1, 2020, 12:24 PM IST

భానుడి తీవ్రతతో అల్లాడిపోతున్న ఇందూరు ఒక్కసారిగా కురిసిన వర్షంతో చల్లబడింది. వాయుగుండం ప్రభావంతో ఉరుములు మెరుపులతో కూడిన వానకు జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు ఉపశమనం పొందారు.

weather in nizamabad district got cool due to rain
చిరుజల్లులతో చల్లబడ్డ ఇందూరు

నిజామాబాద్​ జిల్లాలోని పలు మండలాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వాయుగుండం ప్రభావంతో కురిసిన వానకు జిల్లాలోని ఎడపల్లి, ఆర్మూర్, నవీపేట్, మెండోరా, ముప్కాల్, బాల్గొండ, జక్రాన్​పల్లి మండలాలతో పాటు కామారెడ్డి జిల్లాలోని పలు గ్రామాలు తడిసిముద్దయ్యాయి.

ఎండలతో సతమతమవుతున్న ఇందూరు ప్రజలు వాతావరణం చల్లబడటం వల్ల ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు.

ABOUT THE AUTHOR

...view details