తెలంగాణ

telangana

కవితకు మద్దతు పలికిన తెలంగాణ స్థానిక సంస్థల ఫోరమ్​

By

Published : Oct 5, 2020, 4:39 PM IST

తెరాస నుంచి నిజామాబాద్​ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పోటీచేస్తున్న కల్వకుంట్ల కవితకు తెలంగాణ స్థానిక సంస్థల ఫోరమ్​ మద్దతు పలికింది. ప్రజాప్రతినిధులు, పట్టభద్రులందరూ ఆమెను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఫోరమ్​ రాష్ట్ర అధ్యక్షుడు బోళ్ల కరుణాకర్​ హైదరాబాద్​ వేదికగా కోరారు.

the-telangana-local-bodies-forum-supported-the-kavitha-of-the-mlc-candidate-in-nizamabad
కవితకు మద్దతు పలికిన తెలంగాణ స్థానిక సంస్థల ఫోరమ్​

తెరాస పార్టీ నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి కల్వకుంట్ల కవితకు మద్దతు ఇస్తున్నట్లు... తెలంగాణ స్థానిక సంస్థల ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు బోళ్ల కరుణాకర్ తెలిపారు. ఈ నెల 9న జరబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవితను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని ఆయన హైదరాబాద్​లో తెలిపారు. 2014లో రాష్ట్ర స్థానిక సంస్థలకు నిధులు లేక నిర్వీర్యం అవుతున్న సమయంలో... ఆనాడు ఎంపీగా ఉన్న కవిత ఎంపీటీసీల ఫోరమ్ ఆధ్వర్యంలో దిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నాకి మద్దతు పలికిందన్నారు.

అంతేకాకుండా అప్పటి కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రి నరేంద్ర సింగ్ తోమర్​తో సంప్రదింపులు చేసి... 15వ ఆర్థిక సంఘం నిధులు రావడం కోసం కృషి చేసిందని పేర్కొన్నారు. అదే విధంగా 2015 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గౌరవ వేతనం విషయంలో కవిత కృషి ఎనలేనిదన్నారు. స్థానిక సంస్థల సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉందని... అభివృద్దికి తోడ్పడే వ్యక్తి కవిత అని... అందుకే స్థానిక సంస్థల ప్రతినిధులు ఓటు వేసి ఆమెను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ఇదీ చూడండి:శాంతి భద్రతలపై ఈ నెల 7న సీఎం కేసీఆర్ విస్తృత స్థాయి సమావేశం

ABOUT THE AUTHOR

...view details