తెలంగాణ

telangana

Welfare Celebrations in Telangana : 'తెలంగాణ సంక్షేమ పథకాలు.. దేశానికే ఆదర్శంగా నిలిచాయి'

By

Published : Jun 9, 2023, 5:18 PM IST

Updated : Jun 9, 2023, 6:20 PM IST

MLC Kavitha Participated in Welfare Celebrations : తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు.. దేశానికే ఆదర్శంగా నిలిచాయని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. మన సంక్షేమ పథకాలకు జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు వచ్చాయని గుర్తు చేశారు. నిజామాబాద్​ జిల్లా డిచ్​పల్లిలో నిర్వహించిన సంక్షేమ సంబురాల్లో ఆమె పాల్గొన్నారు.

Welfare Celebrations in Telangana
Welfare Celebrations in Telangana

Telangana Decade Celebrations 2023 : ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు.. దేశానికి ఆదర్శంగా నిలిచాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న తెలంగాణ సంక్షేమ సంబురాల్లో ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్​తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్​ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని కవిత తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంగిలి చేతులతో విసిరినట్లు పింఛన్​ ఇచ్చిందని.. బీఆర్​ఎస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఆసరా పథకం ప్రారంభించి అవ్వలకు అండగా నిలిచారన్నారు.

Welfare Celebrations in Telangana : 'తెలంగాణ సంక్షేమ పథకాలు.. దేశానికే ఆదర్శంగా నిలిచాయి'

MLC Kavitha Latest News : ఈ క్రమంలోనే తెలంగాణలో అమలు చేస్తున్నంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేదన్నారు. మన సంక్షేమ పథకాలకు జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు వచ్చాయని కవిత గుర్తు చేశారు. రాష్ట్రంలో 33 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసి.. డయాలసిస్ బాధితులకు కేసీఆర్ ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. ఎన్నో రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నా.. కేవలం తెలంగాణలో మాత్రమే బీడీ కార్మికులకు నెలకు రూ.2016 పింఛన్​ ఇస్తున్నామని తెలిపారు. రైతులకు కేసీఆర్ అండగా నిలిచి.. వారిని ప్రేమగా చూసుకుంటున్నారని వివరించారు. దేశంలోని రైతులంతా తమకూ కేసీఆర్ పాలన కావాలని కోరుతున్నారన్నారు.

సీఎం కేసీఆర్​ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంగిలి చేతులతో విసిరినట్లు పింఛన్​ ఇచ్చింది. బీఆర్​ఎస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఆసరా పథకం ప్రారంభించి అవ్వలకు అండగా నిలిచారు. తెలంగాణలో అమలు చేస్తున్నంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వందేశంలోనే ఎక్కడా లేదు. మన సంక్షేమ పథకాలకు జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు వచ్చాయి. ఎన్నో రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నా.. కేవలం తెలంగాణలో మాత్రమే బీడీ కార్మికులకు నెలకు రూ.2016 పింఛన్​ ఇస్తున్నాం. రైతులకు కేసీఆర్ అండగా నిలిచి.. వారిని ప్రేమగా చూసుకుంటున్నారు. దేశంలోని రైతులంతా కేసీఆర్ పాలన కావాలని కోరుతున్నారు. - కవిత, బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ

బీజేపీ నేతలు సోషల్ మీడియాతో కాలం గడుపుతున్నారే తప్ప.. సంక్షేమ పథకాలు ఎక్కడ అని కవిత ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఇల్లు లేని వారికి, ఇళ్ల స్థలాలు లేని వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే మరో మంచి పథకం తీసుకొస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మాజీ ఎమ్మెల్సీ విజీ గౌడ్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, స్థానిక బీఆర్​ఎస్​ కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Last Updated :Jun 9, 2023, 6:20 PM IST

ABOUT THE AUTHOR

...view details