ETV Bharat / state

MLC Kavitha: 'కేసీఆర్​ను ఎదుర్కొనే ధైర్యం లేకే నాపై ఆరోపణలు'

author img

By

Published : Apr 13, 2023, 4:25 PM IST

MLC Kavitha Tweet on Sukesh : సుఖేశ్​తో తనకు ఎలాంటి పరిచయం లేదని ట్విటర్​ వేదికగా ఎమ్మెల్సీ కవిత వివరణ ఇచ్చారు. కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా తనపై, బీఆర్​ఎస్​, కేసీఆర్​పై అదే పనిగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. సీఎం కేసీఆర్​ను ఎదుర్కొనే ధైర్యం లేకనే.. ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

kavitha
kavitha

MLC Kavitha Tweet on Sukesh : సీఎం కేసీఆర్​ను ఎదుర్కొనే ధైర్యం లేకనే.. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత ట్విటర్​ వేదికగా మండిపడ్డారు. ఫేక్​ చాట్​లతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన చెందారు. బీఆర్​ఎస్​ పార్టీపై ఉద్దేశపూర్వకంగానే పని కట్టుకుని అబద్ధపు ప్రచారాలు చేశారని ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే బీఆర్​ఎస్ పార్టీకి సుమారు రూ.75 కోట్లు ఇచ్చానని చెప్పిన.. ఆర్థిక నేరగాడు సుఖేశ్​తో తనకు ఎలాంటి పరిచయం లేదని వివరణ ఇచ్చారు. సుఖేశ్​తో కవితకు సంబంధాలున్నాయని కొన్ని మీడియా సంస్థలు అదే పనిగా ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారాలు చేశాయని మండిపడ్డారు. ఇది వరకు తన మొబైల్​ ఫోన్​ విషయంలో కూడా అదే పనిగా తప్పుడు వార్తలు రాశారన్నారు. మళ్లీ ఇప్పుడు క్రిమినల్​ సుఖేశ్​ను పావుగా వాడుకొని తెలంగాణ ప్రభుత్వాన్ని, బీఆర్​ఎస్​ పార్టీని, కేసీఆర్​ను, వారి కుటుంబ సభ్యులను బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు.

బీఆర్​ఎస్​కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే ఇలాంటి అసత్యపు ప్రచారాలకు బీజేపీ పూనుకుంటుందని కవిత ట్వీట్​ చేశారు. ఒక ఆర్థిక నేరగాడు అనామక లేఖను రాస్తే.. అది పట్టుకొని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్​ రావు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసి రాద్దాంతం చేయడం ఏంటని ప్రశ్నించారు. ఎంపీ అర్వింద్​ బీజేపీ టూల్ ​కిట్​లో భాగంగానే సామాజిక మాధ్యమాల్లో బురద జల్లే కార్యక్రమానికి పూనుకొని.. ఒక ప్రణాళిక ప్రకారం దానినే అమలు చేస్తున్నారన్నారు. ఆ పార్టీ ఆడుతున్న ఆటలు అందరికీ తెలుసని.. ఈ విషయాలను అందరూ గమనిస్తూనే ఉన్నారని హెచ్చరించారు.

కొందరు పాత్రికేయులు కనీస విలువలు పాటించకపోవడం.. అత్యంత బాధాకరమని కవిత అసహనం వ్యక్తం చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా.. పని కట్టుకుని తప్పుడు వార్తలను ప్రచురించాయని మండిపడ్డారు. రాజకీయ ఎజెండాలో మీడియా సంస్థలు కూడా పావుగా మారడం, బీఆర్​ఎస్​ పార్టీపై అడ్డగోలుగా తప్పుడు ప్రచారం చేయడం చూస్తే ఎన్నికల ఏడాదిలో మరెంతో దిగజారి వార్తలు ప్రసారం చేస్తారని తెలంగాణ సమాజం గ్రహించాలని.. జాగ్రత్త పడాలని సూచించారు.

"గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వం మీద, బీఆర్​ఎస్​ పార్టీ మీద, మరీ ముఖ్యంగా నా మీద ఉద్దేశపూర్వకంగా కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. బీఆర్​ఎస్​ పార్టీ పొందుతున్న ప్రజాదరణను, కేసీఆర్​ గారి జాతీయస్థాయి కార్యాచరణను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక తెలంగాణ వ్యతిరేకులు మీడియా సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని పేపర్లు, టీవీ ఛానెళ్లు, యూట్యూబ్​ మీడియాల ద్వారా పని గట్టుకొని బీఆర్​ఎస్​ పార్టీ మీద ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారు." - ఎమ్మెల్సీ కవిత ట్వీట్​

  • తెలంగాణ బిడ్డలం తలవంచం.. తెగించి కొట్లాడుతాం..!

    జై తెలంగాణ... జై భారత్ pic.twitter.com/f8ha3TF7Sa

    — Kavitha Kalvakuntla (@RaoKavitha) April 13, 2023
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.