తెలంగాణ

telangana

MLC Kavitha Chit Chat With Media : 'రాష్ట్రంలో బీఆర్​ఎస్​దే అధికారం.. వంద సీట్లతో హ్యాట్రిక్​ సర్కారు ఏర్పాటు చేస్తాం'

By ETV Bharat Telangana Team

Published : Oct 26, 2023, 3:26 PM IST

MLC Kavitha Chit Chat With Media : రాష్ట్రంలో మళ్లీ బీఆర్​ఎస్​ పార్టీనే అధికారంలోకి వస్తుందని బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. వంద సీట్లతో హ్యాట్రిక్​ సర్కారును ఏర్పాటు చేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్​లో మీడియాతో జరిగిన చిట్​చాట్​లో ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.

MLC Kavitha Chit Chat
MLC Kavitha Chit Chat With Media

MLC Kavitha Chit Chat With Media : తెలంగాణలో మళ్లీ అధికారం బీఆర్​ఎస్​దేనని.. వంద సీట్లతో హ్యాట్రిక్​ సర్కారు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్​లో మీడియాతో జరిగిన చిట్​చాట్(MLC Kavitha Chit Chat)​లో కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం బీజేపీ, కాంగ్రెస్​ పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో ఉన్నాయని.. అందుకే సీఎం కేసీఆర్(CM KCR)​ పథకాల సృష్టికర్త అని ఎమ్మెల్సీ కవిత కొనియాడారు. బీఆర్​ఎస్​ పార్టీకి ఇతర పార్టీల మేనిఫెస్టోని కాపీ చేయాల్సిన అవసరం లేదని.. తమ పథకాలనే ఇతర పార్టీలు కాపీ కొడుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్​, బీజేపీకి చెందిన కొందరు నాయకులు కేటీఆర్​పై పోటీ చేయాలని చూస్తున్నారని.. ఈసారి కేసీఆర్​పై ఎవరు పోటీ చేసినా ఓటమి తప్పదని హెచ్చరించారు. తెలంగాణలో బీజేపీకి అసలు అవకాశమే లేదని.. ఆ పార్టీకి డిపాజిట్లు దక్కడం కూడా కష్టమేనని కవిత అన్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రజల్లో విశ్వసనీయతను పోగొట్టుకుందన్నారు.

MLC Kavitha Respond on Revanth Reddy Tweet : శవాల మీద పేలాలు ఏరుకునే పార్టీ కాంగ్రెస్​.. రేవంత్​రెడ్డికి ఎమ్మెల్సీ కవిత కౌంటర్

MLC Kavitha Sensational Comments on BJP and Congress : కోరుట్లలో ఎంపీ ధర్మపురి అర్వింద్​ను ఓడిస్తామని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. అనంతరం కాంగ్రెస్​ పార్టీపై విరుచుకుపడ్డారు. గాంధీలకే గ్యారంటీ లేదు.. అలాంటిది కాంగ్రెస్​ గ్యారెంటీలను ప్రజలు ఎలా నమ్ముతారని విమర్శించారు. బీసీలకు గొడ్డలి పెట్టు కాంగ్రెస్​ అని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో మైనార్టీలను కాంగ్రెస్​ కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తోందని మండిపడ్డారు. ఈసారి ఎన్నికలు రాహుల్​ వర్సెస్​ రైతులుగా ఉంటారని బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఈ క్రమంలో రైతుబంధుపై కాంగ్రెస్​ ఎన్నికల కమిషన్​కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మరోసారి మండిపడ్డారు.

రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్​ : కాంగ్రెస్​ పార్టీ రైతు వ్యతిరేకి, దళిత వ్యతిరేకి, అభ్యుదయ వ్యతిరేకి అని ఎమ్మెల్సీ కవిత ఎక్స్​(ట్విటర్​)లో విమర్శలు చేశారు. రైతులు, దళితుల కోసం బీఆర్​ఎస్​ ప్రభుత్వం రైతు బంధు, దళిత బంధు వంటి సంక్షేమ పథకాలను ప్రవేశ పెడితే.. వాటిని కాంగ్రెస్​ వ్యతిరేకిస్తే కొత్త పతనాన్ని చవిచూస్తుందని హెచ్చరించారు. గత ఆరేళ్లుగా వ్యవసాయ రంగంలో గణనీయమైన అభివృద్ధిని తెలంగాణ చూస్తోందని చెప్పారు. వాటిలో భాగంగా రైతులకు రైతు బంధు అనే దేశంలోనే రైతుల కోసం ఆలోచించిన తొలి రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. ఇప్పుడు ఆ రైతు బంధు రాకుండా ఆటంకం కలిగిస్తూ.. రైతు వ్యతిరేక వైఖరిని అవలంభిస్తోంది. ఈ విషయం నిరుత్సాహానికి గురి చేసిన.. అందులో ఆశ్చర్యం లేదని కవిత ట్వీట్​ చేశారు.

Political War in Jagtial : జగిత్యాలలో రాజకీయ జగడం.. వారి మధ్యే ప్రధాన పోటీ

MLC Kavitha fires on Rahul Gandhi : తెలంగాణతో రాహుల్ ​గాంధీ కుటుంబానికి ఉంది ప్రేమబంధం కాదు.. నమ్మక ద్రోహ బంధం : ఎమ్మెల్సీ కవిత

ABOUT THE AUTHOR

...view details