తెలంగాణ

telangana

'భవిష్యత్తులో నిర్మల్​ జిల్లాను మరింత అభివృద్ధి చేస్తాం'

By

Published : Oct 28, 2020, 3:13 PM IST

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే తెలంగాణలో పట్టణాలు, పల్లెలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో 4.5 కోట్ల వ్యయంతో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు.

'భవిష్యత్తులో నిర్మల్​ జిల్లాను మరింత అభివృద్ధి చేస్తాం'
'భవిష్యత్తులో నిర్మల్​ జిల్లాను మరింత అభివృద్ధి చేస్తాం'

నిర్మల్​ జిల్లా కేంద్రంలో మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి పర్యటించారు. నగరంలో నాలుగున్నర కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆదర్శనగర్, మదీనా కాలనీలో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు.

నిర్మల్ జిల్లా ఏర్పడిన తరువాత అభివృద్ధి వేగంగా జరుగుతోందని మంత్రి అన్నారు. 2 నెలల్లో పట్టణంలోని రహదారుల రూపురేఖలు మారిపోతాయన్నారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ ఛైరపర్సన్​ విజయలక్ష్మి, మున్సిపల్​ ఛైర్మన్​ గండ్రత్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:సుప్రీంకోర్టులో రేవంత్‌రెడ్డి పిటిషన్‌ కొట్టివేత

ABOUT THE AUTHOR

...view details