ETV Bharat / state

సుప్రీంకోర్టులో రేవంత్‌రెడ్డి పిటిషన్‌ కొట్టివేత

author img

By

Published : Oct 28, 2020, 12:58 PM IST

Updated : Oct 28, 2020, 6:24 PM IST

సుప్రీంకోర్టులో రేవంత్‌రెడ్డి పిటిషన్‌ కొట్టివేత
సుప్రీంకోర్టులో రేవంత్‌రెడ్డి పిటిషన్‌ కొట్టివేత

12:53 October 28

సుప్రీంకోర్టులో రేవంత్‌రెడ్డి పిటిషన్‌ కొట్టివేత

    సచివాలయం కూల్చివేత సవాలు చేస్తూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్​ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కూల్చివేతపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ ఆయన ఈ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం దీనిని విచారించింది.  

    ఇదే అంశానికి సంబంధించిన పిటిషన్​ను గతంలో సుప్రీంకోర్టు కొట్టివేసిందని జస్టిస్ అశోక్ భుషణ్ గుర్తు చేశారు. పిటిషనర్​ తరఫు సీనియర్ న్యాయవాది రాజ్ పంజ్వానీ తాము విచారణ కోరుతున్న అంశాలు వేరని కోర్టుకు తెలిపారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన పిటిషన్​లో మీరు పార్టీగా లేరు కదా అని రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాదిని జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం ప్రశ్నించింది.  

    భవనాల కూల్చివేతకు పర్యావరణ అనుమతులు అవసరమా లేదా అన్న అంశం దేశం మొత్తానికి వర్తిస్తుందని.. ఈ సున్నితమైన అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని రాజ్ పంజ్వానీ కోరారు. హైకోర్టు ఆదేశాలిచ్చిన పిటిషన్‌లో రేవంత్ రెడ్డి పార్టీగా లేనందున ఈ పిటిషన్​ను విచారించలేమంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో భవనాల కూల్చివేతకు పర్యావరణ అనుమతులు అవసరమా లేదా అన్న అంశాన్ని ఎన్జీటీ పరిశీలించవచ్చంటూ సుప్రీం స్పష్టం చేసింది. 

ఇదీ చూడండి: గొర్రెకుంట మృత్యుబావి కేసుపై కాసేపట్లో తీర్పు

Last Updated :Oct 28, 2020, 6:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.