తెలంగాణ

telangana

'గత సీజన్ సమస్యలు పునరావృతం కావొద్దు'

By

Published : Nov 10, 2020, 7:22 PM IST

నిర్మల్ జిల్లా కేంద్రంలో పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోళ్లపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు.

'గత సీజన్ సమస్యలు పునరావృతం కావొద్దు'
'గత సీజన్ సమస్యలు పునరావృతం కావొద్దు'

నాణ్యతా ప్రమాణాలు పాటించి వరి ధాన్యం కొనుగోలు చేయాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోళ్లపై రైస్ మిల్లర్లు, ట్రాన్స్ పోర్టు కాంట్రాక్టర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో అయన పాల్గొన్నారు.

ప్రభుత్వ నిబంధనలు పాటించి నాణ్యతా ప్రమాణాలకు లోబడి ధాన్యం కొనుగోలు చేయాలని మంత్రి అన్నారు. గత రబీ సీజన్లో ఏర్పడిన సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూడాలన్నారు. కొనుగోలు చేసిన అనంతరం ధాన్యం ను రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు.

ఈ సమావేశంలో పాలానాధికారి ముషారఫ్ ఫారుఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, డీసీఎంఎస్ ఛైర్మన్ లింగయ్య, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ నర్మద తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: కొనుగోళ్లలో గందరగోళం.. దిక్కుతోచని స్థితిలో పత్తి రైతు

ABOUT THE AUTHOR

...view details