తెలంగాణ

telangana

వారికి గుడ్​న్యూస్​.. గౌరవ వేతనం రూ.3 వేలకు పెంచుతూ జీవో జారీ

By

Published : Feb 5, 2023, 9:46 AM IST

Midday Meals in Government Schools‍: ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండిపెట్టే మహిళా కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గౌరవ వేతనం రూ.3 వేలకు పెంచుతామని ప్రభుత్వం 10 నెలల తర్వాత జీవో ఇచ్చింది. అయితే ఈ రూ.3 వేలు ఏ మాత్రం సరిపోవని, రూ.15 వేలకు పెంచితే తమకు గిట్టుబాటు అవుతుందని నారాయణ్‌పేట్‌ జిల్లా మహిళా కార్మికులు కోరుతున్నారు.

Midday Meals in Government Schools‍
Midday Meals in Government Schools‍

దయనీయంగా 'మధ్యాహ్న భోజన' మహిళా కార్మికుల పరిస్థితి

Midday Meals in Government Schools‍: కూలీ నాలీ చేసుకున్నా రోజుకు రూ.300 నుంచి రూ.400 వరకు లభిస్తాయి. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు మధ్యాహ్న భోజనం చేసే కార్మికుల గౌరవ వేతనం ఎంతో తెలుసా..? రూ.3 వేలు. ఈ నెల 4 వరకూ కేవలం రూ.1000 ఉండేది. ఆ డబ్బులు కూడా 6 నెలలకు ఒకసారి వస్తాయి. ఇంత తక్కువ వేతనంతో తమ కడుపు ఎలా నిండుతుందని మహిళా కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మధ్యాహ్న భోజనం వండిపెట్టే మహిళా కార్మికుల గౌరవ వేతనం రూ.3 వేలకు పెంచుతామని గతేడాది మార్చిలో సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఆ మాటలు చెప్పి పది నెలల తరువాత శనివారం జీవో జారీ చేశారు. రూ.15 వేల వేతనం ఐతేనే తమకు గిట్టుబాటు అవుతుందని మహిళా కార్మికులు అంటున్నారు. ప్రభుత్వం తమపైనా దయ చూపాలని మధ్యాహ్న భోజన కార్మికులు వేడుకుంటున్నారు.

ఉపాధిహామీ పనికి వెళ్తే రోజు రూ.150 నుంచి రూ.300 కూలీ పడుతుందని, మధ్యాహ్న భోజనం చేస్తే వందలోపు కూడా రావడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తే భవిష్యత్తులో భరోసా ఉంటుందని ఆశతో 2008 నుంచి పని చేస్తున్నామన్నారు. రానురాను తమ ఆశలు ఆవిరై పోతున్నాయని బాధ పడుతున్నారు. ప్రభుత్వం తమ వేతనాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పెంచాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details