తెలంగాణ

telangana

వర్షం పడితే ఆ రైల్వే అండర్ పాస్​ నుంచి వెళ్లాలంటే సాహసమే!

By

Published : Jul 29, 2020, 8:47 PM IST

Updated : Jul 29, 2020, 11:10 PM IST

చినుకుపడ్డదంటే చాలు ఆ రైల్వే అండర్​ పాస్ నుంచి వెళ్లాలంటే వణుకే. ఆ వైపు వాహనదారులు వెళ్లాలంటే బెంబేలెత్తుత్తారు. అండర్ పాస్​లో నిలిచిన వర్షం నీరును దాటి వెళ్లాలంటే ఇబ్బందులు తప్పవు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా సమస్యను మాత్రం పరిష్కరించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

railway bridge
railway bridge

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలోని కన్నెకల్ వెళ్లే రైల్వే బ్రిడ్జి అండర్​పాస్ పరిస్థితి దారుణంగా తయారైంది. వర్షం పడితే చాలు ఆ వైపు వెళ్లే వాహనాలు బ్రిడ్జి కింద వరద నీటిలో ఈత కొట్టాల్సిందే. మంగళవారం రాత్రి కురిసిన వర్షం కారణంగా రైల్వే బ్రిడ్జి కింద వర్షం నీళ్లు నిలిచాయి. ఆ వైపు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

దిల్లీకి బత్తాయి లోడ్ తీసుకెళ్తున్న రెండు లారీలు అందులో చిక్కుకున్నాయి. దాదాపు గంటన్నర పాటు ఇబ్బంది పడాల్సి వచ్చింది. చివరికి జేసీబీ సాయంతో లారీలను బయటకు తీశారు. మచనపల్లి, గంగణపాలెం, కన్నెకల్, ముకుందపురం, గారకుంటా పాలెం గ్రామ ప్రజలకు ఇదే ప్రధాన రోడ్డు. బ్రిడ్జి కింద నీళ్లు నిలిస్తే రాకపోకలు బంద్ అవుతాయి. ఈ సమస్యపై ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇది చదవండి:ఒకేసారి ఒక్కరితో గర్భం దాల్చాలని.. ఆ కవలల వింత కోరిక

Last Updated : Jul 29, 2020, 11:10 PM IST

ABOUT THE AUTHOR

...view details