తెలంగాణ

telangana

Jagdish Reddy Vs Kishan Reddy : 'మీ రాష్ట్రాల్లో అభివృద్ధి.. మా తొమ్మిదేళ్ల పాలనలో అభివృద్ధిపై చర్చకు సిద్ధమా'

By

Published : Jun 2, 2023, 8:50 PM IST

Jagdish Reddy Countered Kishan Reddy : కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డికి మంత్రి జగదీశ్​ రెడ్డి సవాల్​ విసిరారు. తెలంగాణ అభివృద్ధిని దేశం మొత్తం కీర్తిస్తుండగా ఇక్కడి బీజేపీ , కాంగ్రెస్ నాయకులు ఈర్షతో బీఆర్​ఎస్​ ప్రభుత్వంపై విషం కక్కుతున్నారని ఆరోపించారు. మేం తెచ్చిన అప్పులతో ఇంటింటికి తాగునీళ్లు, రోడ్ల అభివృద్ధి, సాగునీటి సమస్యను పరిష్కరించామని వెల్లడించారు.

jagadish reddy
jagadish reddy

Jagdish Reddy Countered Attack Kishan Reddy : తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్బంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి , బండి సంజయ్​లు తెలంగాణలో అభివృద్ధి లేదు అప్పులు పెరిగి ప్రభుత్వం మాఫియాల మారిందంటూ చేసిన విమర్శలపై రాష్ట్రమంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధిని దేశం మొత్తం కీర్తిస్తుండగా ఇక్కడి బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఈర్శ్యతో బీఆర్​ఎస్​ ప్రభుత్వంపై విషం కక్కుతున్నారని ఆరోపించారు. 25 సంవత్సరాలుగా బీజేపీ ఎలుబడి ఉన్న మీ నేత ప్రధాని మోదీ సొంతరాష్ట్రం గుజరాత్, పదేళ్ల తెలంగాణ అభివృద్ధిని పోల్చి చూద్దామా అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు.

డబుల్ ఇంజిన్ సర్కార్లు అంటూ గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ గుజరాత్​లో, వారి పాలిత రాష్ట్రాల్లో ఒరగపెట్టింది ఏమి లేదని జగదీశ్​రెడ్డి దుయ్యబట్టారు. అప్పుల గురించి మాట్లాడుతున్న బీజేపీ నాయకులు తెలంగాణ అభివృద్ధిని గమనించాలని అన్నారు. తెలంగాణ అభివృద్ధి నాడు - నేడు ఎలా ఉందో ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. మేం తెచ్చిన అప్పులతో ఇంటింటికి తాగునీళ్లు, రోడ్ల అభివృద్ధి, సాగునీటి సమస్యను పరిష్కరించామని వెల్లడించారు.

"గుజరాత్​తో తెలంగాణను పోల్చుకుందామా. 25 ఏళ్లుగా గుజరాత్​లో బీజేపీ ఉంది.. అది కూడా మోదీ నాయకత్వంలో. మరి అక్కడ 24 గంటల విద్యుత్​ ఇస్తున్నారా. ఇంటింటికీ నీళ్లు ఉన్నాయా గుజరాత్​లో.. అక్కడ రైతులకు రక్షణ ఉందా.. తెలంగాణలో ఇవి అన్ని ఉన్నాయని చూపిస్తారా మీరు. దేశం కోసం తెచ్చిన అప్పులను అంబానీ, అదానీలకు దారాదత్తం చేశారు కదా. తమకు కేంద్రం ఇచ్చిన అప్పులను ప్రజలకు ఇచ్చాము. మాఫియా ప్రభుత్వం మీది."- జగదీశ్​రెడ్డి, రాష్ట్రమంత్రి

Jagadish Reddy Challenge Kishan Reddy On TS Development : మేం చేసిన అప్పు ఉత్పత్తి రంగాలకు ఖర్చు చేసి అభివృద్ధి సాధిస్తే.. లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిన మోదీ సర్కారు ఆ సొమ్మును కొద్ది మందికే ఇచ్చారని మండిపడ్డారు. అదాని, అంబానీ వంటి కొద్దిమందికి ఉపయోగపడే కేంద్రానిదే మాఫియా ప్రభుత్వమని ధ్వజమెత్తారు. రాజకీయ పబ్బం కోసం ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. ఫ్యూడల్ వ్యవస్థకు ఊపిరి పోస్తున్న బీజేపీ క్రూరమైందని ఆరోపణలు చేశారు. ఉద్యోగాల కల్పనపై చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు.

కిషన్ ​రెడ్డికి జగదీశ్​ రెడ్డి సవాల్​ : మొత్తం బీజేపీ పాలిత రాష్ట్రాలలో కలిసి చేసిన అభివృద్ధిని.. గడిచిన తొమ్మిది ఏళ్లలో తెలంగాణలో చేసిన అభివృద్ధితో పోల్చుకుందామా అంటూ సవాల్​ విసిరారు. కాంగ్రెస్,బీజేపీలకు ప్రత్యామ్నాయం ఉన్న చోట కాంగ్రెస్, బీజేపీ యేతరులే విజయం సాధిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో ఉనికి కోసమే బీజేపీ పడరానిపాట్లు పడుతుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ గురించి మాట్లాడే నైతికతనే కిషన్ రెడ్డికి లేదని తేల్చిచెప్పారు. అంతగా ప్రేమ ఉంటే ఇక్కడి అవసరాలకు అనుగుణంగా నిధులు తెచ్చి మాట్లాడితే మీ మీద విశ్వసనీయత పెరుగుతుందని హితవు పలికారు. బీజేపీ కుట్రలు తెలంగాణలో పని చేయవని.. యావత్ తెలంగాణ సమాజం సీఎం కేసీఆర్ వెంటే నడుస్తుందని మంత్రి జగదీశ్​రెడ్డి వెల్లడించారు.

మీ రాష్ట్రాల్లో అభివృద్ధి.. మా తొమ్మిదేళ్ల పాలనలో అభివృద్ధిపై చర్చకు సిద్ధమా

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details