తెలంగాణ

telangana

'రాజగోపాల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి కోవర్టు రాజకీయాల్ని అంతా గమనిస్తున్నారు'

By

Published : Oct 20, 2022, 7:23 PM IST

Jagadishreddy fires on komatireddy brothers: నల్గొండ జిల్లా నాశనం కావడానికి, మునుగోడు వెనుకబాటుతనానికి.. కోమటిరెడ్డి సోదరులే కారణమని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. రాజగోపాల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి చేస్తున్న కోవర్టు రాజకీయాలను అందరూ గమనిస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధం అభివృద్ధి, సంక్షేమ ఫలాలను.. ప్రజలకు అందిస్తున్న కేసీఆర్‌ను చూసి ఓర్వలేకే... ప్రధాని మోదీ కక్షగట్టి ఈ ఉపఎన్నిక తెచ్చారని జగదీశ్‌రెడ్డి విమర్శించారు.

Jagadishreddy
Jagadishreddy

Jagadishreddy fires on komatireddy brothers: ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తెలంగాణలోనే నిలవరించారన్న కుట్రతో మునుగోడు ఉపఎన్నిక తెచ్చారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ తరహా సంక్షేమ పథకాలు తమ రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని.. దేశవ్యాప్తంగా ప్రజలు భాజపాను ప్రశ్నిస్తున్నారన్నారు. కేసీఆర్ కారణంగా ప్రజలు తిరగబడుతున్నారన్న ఉద్దేశంతో రాజగోపాల్ రెడ్డిని 18వేల కోట్ల రూపాయలతో కొనుగోలు చేసి ఉపఎన్నిక రుద్దారని ధ్వజమెత్తారు.

కోమటిరెడ్డి సోదరుల వలనే నల్గొండ జిల్లా నాశనమైందన్న విషయం ప్రజలకు అర్థమైందని జగదీశ్‌రెడ్డి అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో ఉండి మూడేళ్ల పాటు కోవర్టుగా చేయగా.. ఇప్పుడు ఆయన అన్న కూడా అదే చేస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలే అంటున్నారని ఆయన ఆరోపించారు. భాజపా బీసీ, దళిత, గిరిజన, మైనారిటీలకు వ్యతిరేకంగా పనిచేస్తే మనువాద పార్టీ అని ధ్వజమెత్తారు. మునుగోడు నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు భాజపా, కాంగ్రెస్ నుంచి తెరాసలో చేరారు. తెలంగాణ భవన్‌లో జగదీశ్‌రెడ్డి కండువాలు కప్పి తెరాసలోకి ఆహ్వానించారు.

'రాజగోపాల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి కోవర్టు రాజకీయాల్ని అంతా గమనిస్తున్నారు'

'నల్గొండ జిల్లా నాశనం కావడానికి కోమటిరెడ్డి బ్రదర్స్‌నే కారణం. రాజగోపాల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి కోవర్టు రాజకీయాల్ని అంతా గమనిస్తున్నారు. కేసీఆర్‌ అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పాలనను మోదీ ఓర్వలేకపోతున్నారు. కేసీఆర్‌ను దెబ్బతీయాలనే కుట్రతోనే మునుగోడు ఉపఎన్నిక తెచ్చారు. రాజగోపాల్‌రెడ్డికి రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చి ఉపఎన్నిక తెచ్చారు.'-జగదీశ్‌రెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details