తెలంగాణ

telangana

Uttam Kumar: 'నాకు చెప్పండి... అవసరమైతే ఎంపీ నిధుల నుంచి ఇస్తా'

By

Published : Aug 8, 2021, 7:48 PM IST

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి... అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఆయా శాఖ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారం దిశగా పలు సూచనలు చేశారు. పెండింగ్​లో ఉన్న పనులపై ఆరా తీశారు.

congress mp uttam kumar reddy on pending works in miryalaguda
congress mp uttam kumar reddy on pending works in miryalaguda

కరోనా వ్యాక్సినేషన్​ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని నల్గొండ ఎంపీ ఉత్తమ్​కుమార్​ రెడ్డి సూచించారు. వ్యాక్సినేషన్​ సెంటర్లలో సరిపడా సిబ్బంది లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాధికారులతో... వీలైతే పార్లమెంటులోనూ ప్రస్తావిస్తానని తెలిపారు. ఆన్​లైన్​ విద్య వల్ల విద్యార్థులు.. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్లు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా... పిల్లలకు వ్యాక్సినేషన్​ పూర్తిచేసి పాఠశాలలు తెరవాలని పార్లమెంటులో ప్రస్తావించటంతో పాటు రాష్ట్రప్రభుత్వానికి కూడా సూచిస్తానని స్పష్టం చేశారు.

ఎంపీ నిధుల్లో నుంచి ఇస్తా...

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి... అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఆయా శాఖ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారం దిశగా పలు సూచనలు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, నీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, రెవెన్యూ శాఖ, ఆర్​డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన అధికారులందరు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పెండింగ్​లో ఉన్న పనులపై ఆరా తీశారు. నిధుల కొరత ఉన్న పనుల వివరాలు సమర్పించితే ఎంపీ నిధుల నుంచి మంజూరు చేయించే ప్రయత్నం చేస్తానని ఉత్తమ్​ హామీ ఇచ్చారు.

నా దృష్టికి తీసుకురండి...

"మిర్యాలగూడ మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. వ్యాక్సిన్​ల కొరత ఉన్నట్లయితే వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శితో మాట్లాడి వ్యాక్సిన్లు అందరికీ అందేలా చేస్తా. ఆన్​లైన్​ విద్య వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది. ప్రభుత్వం ముందుచూపుతో ఆలోచించి వ్యాక్సిన్ ప్రక్రియను పూర్తి చేసి పాఠశాలలు తెరిచే ప్రయత్నం చేయాలి. రోడ్లు, పాఠశాల భవనాలు నిర్మాణాలకు నిధుల కొరత ఉంటే.. నివేదికలు సమర్పించండి.. ఎంపీ నిధుల నుంచి నావంతు ప్రయత్నంగా నిధులు సమీకరించే ప్రయత్నం చేస్తా. "

ABOUT THE AUTHOR

...view details