తెలంగాణ

telangana

'పవర్ హౌజ్ ఘటనలో 108 సిబ్బంది సేవలు అద్భుతం'

By

Published : Sep 10, 2020, 9:52 PM IST

నాగర్ కర్నూల్ కలెక్టరేట్ లో శ్రీశైలం ఎడమ గట్టు పవర్ ప్లాంట్ ప్రమాద సమయంలో అత్యద్భుత ప్రతిభ కనబర్చిన 108 సిబ్బందిని కలెక్టర్ శర్మాన్ అభినందించారు.

'పవర్ హౌజ్ ఘటనలో 108 సిబ్బంది సేవలు అద్భుతం'
'పవర్ హౌజ్ ఘటనలో 108 సిబ్బంది సేవలు అద్భుతం'

శ్రీశైలం పవర్ హౌజ్ ఘటనలో 108 సిబ్బంది చేసిన సేవలు వర్ణనాతీతమని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మాన్ పేర్కొన్నారు. కలెక్టరేట్ లో శ్రీశైలం ఎడమ గట్టు పవర్ ప్లాంట్ ప్రమాద సమయంలో అత్యద్భుత ప్రతిభ కనబర్చిన 108 సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. ప్రమాదం జరిగిన 2 గంటల్లో నాలుగు 108 అంబులెన్స్ లు ,ఆక్సిజన్ స్పేర్ సిలిండర్స్ తో ప్రమాద స్థలానికి చేరుకొని ప్రాణాలకు తెగించారని కొనియాడారు.

16 గంటల నిరంతర శ్రమ వల్ల మృతదేహాలను తీసుకురావటం సులువైందన్నారు.

ఇదీ చూడండి:'రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హామీలు నెరవేర్చడం లేదు'

ABOUT THE AUTHOR

...view details