తెలంగాణ

telangana

'కేంద్రంపై తెరాస విమర్శలు సరికాదు'

By

Published : Jun 7, 2020, 6:59 PM IST

భారతీయ జనతా పార్టీ హయాంలో దేశం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ సీనియర్​ నేత వరద రాజేశ్వరరావు అన్నారు. ములుగులో ఏర్పాటు చేసిన పార్టీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Bjp Press Meet in Mulugu Town
‘భాజపా హయాంలో దేశం ముందుకెళ్తుంది’

భాజపా హయాంలో దేశం దినదినాభివృద్ధి చెందుతోందని భాజపా నేత, మాజీ ఎమ్మెల్యే వరద రాజేశ్వరరావు అన్నారు. కరోనా మహమ్మారి పేదల బతుకులను ఆగం చేసినా.. కేంద్ర ప్రభుత్వం పేదల పాలిట పెన్నిధిలా ఆదుకుందని అన్నారు. జన్​ధన్​ ఖాతాల ద్వారా తెల్లరేషన్​ కార్డు ఉన్న కుటుంబాలకు పదిహేను వందల రూపాయలు జమ చేశారని గుర్తు చేశారు. నిరుపేదలకు 5 కిలోల బియ్యంతోపాటు నిత్యావసర సరకులు అందించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సాయం అందిస్తే.. టీఆర్​ఎస్​ ప్రభుత్వం ఆ సరకులను గులాబీ సంచుల్లో పెట్టి.. పంచి ప్రచారం చేసుకుంటోందని తెలిపారు.

రైతులు, పేదల కోసం.. కేంద్ర ప్రభుత్వం ఎన్నో నిధులు కేటాయిస్తుంటే.. తెరాస నాయకులు కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు.

ఇవీ చూడండి:రాష్ట్రంలో ఈరోజు 206 మందికి కరోనా

ABOUT THE AUTHOR

...view details